Black Fungus: కామారెడ్డి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం.. మెడికల్‌ ఆఫీసర్‌ మృతి.. గ్రామంలో విషాద ఛాయలు

|

Jun 13, 2021 | 12:33 PM

Black Fungus: ఒక వైపు కరోనా.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ఇలా ఒకదాని వెనుక ఒకటి జనాలను వెంటాడుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతుండగా..

Black Fungus: కామారెడ్డి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం.. మెడికల్‌ ఆఫీసర్‌ మృతి.. గ్రామంలో విషాద ఛాయలు
Black Fungus
Follow us on

Black Fungus: ఒక వైపు కరోనా.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ఇలా ఒకదాని వెనుక ఒకటి జనాలను వెంటాడుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతుండగా, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు తెలంగాణ రాష్ట్రంలో వణికిస్తున్నాయి. తాజాగా మరో బ్లాక్‌ ఫంగస్‌ కేసు బయటపడింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన మెడికల్‌ ఆఫీసర్‌ గోవర్ధన్‌ను బ్లాక్‌ ఫంగస్‌ బలి తీసుకుంది. ప్రస్తుతం ధర్పల్లి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్‎గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం నాడు హైదరాబాద్‎లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోవర్ధన్ మృతి చెందాడు. కాగా, 20 రోజుల క్రితం తన తల్లి కరోనా వైరస్‎తో పోరాడి మృతి చెందింది. తల్లి మృతి చెందిన తర్వాత కొడుకు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Amalapuram: ఈ పొగతో కరోనా పరార‌వుతుంద‌ట‌.. అమలాపురంలో వైర‌స్ కట్టడికి వినూత్న ప్రయత్నం

Coronavirus : మరోసారి కనిష్ఠ స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు, కాని.. భయపెడుతోన్న మరణాలు