మద్యం షాపులోకి చోరీకి వచ్చిన ఒక దొంగ ఫుల్లుగా మద్యం తాగి అక్కడే నిద్రపోయి..దొరికిపోయిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో చోటుచేసుకుంది. నార్సింగి మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్స్ నిర్వాహకులు ఆదివారం రాత్రి పనిగంటలు అయిపోగానే… షాపుకు తాళం వేసి వెళ్లిపోయారు. తిరిగి సోమవారం ఉదయం వచ్చి షాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక వ్యక్తి వైన్ షాప్‌లో బాగా మద్యం సేవించి పడుకొని ఉండడం సిబ్బంది గమనించారు. అతిగా మద్యం సేవించి స్పృహలేని స్థితిలో అక్కడ పడిపోయి ఉన్నాడు. వైన్ షాప్ పై రేకులు తొలగించి లోనికి చొరబడిన వ్యక్తి డబ్బులు, మద్యం బాటిల్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాడు.. వెళ్లిపోయే టైంకి..అక్కడ ఉన్న మందు బాటిల్స్ చూసి టెంప్ట్ అయిపోయి.. బాటిల్ ఓపెన్ చేశాడు. అతిగా మద్యం సేవించడంతో.. మత్తు తలకెక్కి సొమ్మసిల్లిపోయాడు. అతడని అదుపులోకి తీసుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే అతను షాప్ లోపలికి వచ్చిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి .అయితే లోపలికి వచ్చాక సీసీ కెమెరాలను ధ్వసం చేసాడు దొంగ.. అన్ని బాగానే చేసాడు కానీ మందును చూసి టెంప్ట్ అయ్యి ఫుల్‌గా తాగి ఆగం అయిపోయాడు. ఇక బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
దొంగ షాపులోకి ఎంటరయిన వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి