AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. ఒక్క క్షణంలో అంతా తలకిందులు.. సీసీ కెమెరాలో ఒళ్లు గగుర్పొడిచే సీన్!

మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్ విధులకు వెళ్తున్న ఏడుగురు మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు భయానకంగా చూపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘోర ప్రమాదం.. ఒక్క క్షణంలో అంతా తలకిందులు.. సీసీ కెమెరాలో ఒళ్లు గగుర్పొడిచే సీన్!
Mancherial Accident
Balaraju Goud
|

Updated on: Sep 28, 2026 | 12:06 PM

Share

మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లో విధులకు వెళ్లేందుకు ఏడుగురు మహిళలు ఆటోలో ప్రయాణిస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద తీవ్రతతో ఆటో నుజ్జునుజ్జవగా.. పలువురు ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

మందమర్రి మండలం పొన్నారం, గుడిపల్లి గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఉదయం విధులకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. నస్పూర్ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా హఠాత్తుగా ఓ బైక్ రావడంతో దాన్ని తప్పించుకునే క్రమంలో ఆటో అదుపుతప్పింది. అదే సమయంలో మంచిర్యాల నుంచి జైపూర్ వైపు వేగంగా వెళ్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది.

లారీ ఢీకొట్టడంతో ఆటో గాల్లోకి ఎగిరి పడింది. ఆటోలో ఉన్న పలువురు మహిళలు రోడ్డుపైకి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో చింతకుంట్ల లక్ష్మి (30), సౌందర్య (25) రవళి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న నస్పూర్ ఎస్సై తహసీన్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

వైరల్ వీడయో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
ఈ కొత్త రిజర్వేషన్‌‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దొరికేసిన హీరోయిన్
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దొరికేసిన హీరోయిన్
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?