పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌కు చెందిన రాకేష్ అనే వ్యక్తి సుల్తానాబాద్‌లోని శ్రీవాణి కాలేజీ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనను ఎవరో వెంబడిస్తున్నారని, తనను చంపేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి, టవర్‌పై కూర్చున్న వ్యక్తిని దిగాలని నచ్చజేప్పే ప్రయత్నిం చేశాడు. ఆయన ఆ వ్యక్తి కిందికి దిగపోవడంతో ఎస్సై తన బంధువులకు ఫోన్ చేసి రప్పించాడు. బంధువులు వచ్చి కిందకు దిగాలని కోరడంతో వెంటనే దిగేసాడు. రాకేష్‌ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాకేష్ ప్రాణ భయంతో ఊరి విడిచి వెళ్లిపోయాడని అతనిపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైనట్లు తెలిసింది.