Leopard Attack: నిర్మల్ జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలకలం.. అలర్ట్‌గా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు..

Leopard Attack: నిర్మల్ జిల్లాలో మరోసారి చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని భైంసా మండలం పాంగ్రీ గ్రామ శివారులో జింక మృతి..

Leopard Attack: నిర్మల్ జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలకలం.. అలర్ట్‌గా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 4:49 PM

Leopard Attack: నిర్మల్ జిల్లాలో మరోసారి చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని భైంసా మండలం పాంగ్రీ గ్రామ శివారులో జింక మృతి చెందింది. అది గమనించిన గ్రామస్తులు సదరు జింకను చిరుత పులి చంపిందంటూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జింక మృతిపై ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు సమాచారం చేరవేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. మృతి చెందిన జింకను పరిశీలించారు. చుట్టు పక్కల అంతా గాలించారు. చిరుత పులి ఆనవాళ్లు కనిపించలేదు. దాంతో జింక మృతిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జింక మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు.

ఫోస్ట్ మార్టం అనంతరం జింకను చిరుత దాడి చేసి చంపిందా? మరేదైనా కారణం వల్ల ఇది జరిగిందా? అనే దానిపై స్పష్టతనిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా పాంగ్రీ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. కాగా, ఇంతకు ముందు కూడా పాంగ్రీ గ్రామ శివారులో చిరుత పులి సంచరించింది. గ్రామ శివారు ప్రాంతంలో జింకపై దాడి చేసి చంపేసింది. ఆ ఘటన మరువక ముందే.. మరోసారి జింక మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బందించాలని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులను వేడుకుంటున్నారు.

Also read:

మరోసారి దేశ ప్రజల మనసును దోచిన ఇండియన్ ఆర్మీ.. మంచుకొండల్లో బాలింతను మోసుకెళ్లిన జవాన్లు

Republic Day Parade: రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్న బంగ్లాదేశ్ త్రివిధ దళాలు.. విదేశీ అతిథి లేకుండా వేడుకలు