జగిత్యాల జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం గరం గరంగా సాగింది. ప్రజా సమస్యలపై చర్చలో ప్రొటోకాల్ వివాదం రచ్చగా మారింది. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని అదికారులపై ఆగ్రహం.. అసహనం వ్యక్తం చేశారు కోరుట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. అధికారుల వైఖరిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రజలు ఓడించిన వాళ్ల మాటలు వింటున్నారని అధికారుల వైఖరిని నిలదీశారు ఎమ్మెల్యే సంజయ్. ఎవరికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎవరికో భయపడి తలవంచే అధికారుల వెన్నుపూస ఎలా సరిచేయాలో తనకు బాగా తెలసన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.
ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వరు కానీ.. ప్రజలు ఓడించిన వాళ్ల మాటలకు మడుగులొత్తుతారా? అంటూ అధికారుల వైఖరిని నిలదీశారు ఎమ్మెల్యే సంజయ్. ఎవరికైనా వెన్నుపూస ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే స్పైన్ స్పెషలిస్ట్‌గా తాను అండగా ఉంటానన్నారు. ప్రజాసమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలే తప్పా.. ఎవరో చెప్పారని ఎవరికో భయపడి తల వంచద్దనేదే అధికారులకు తన హంబల్ రిక్వెస్ట్ అన్నారు ఎమ్మెల్యే సంజయ్. ప్రస్తుతం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…