AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konda Surekha: అనుకోకుండా ఓ కుటుంబంపై నోరు జారా.. కొండా సురేఖ వివరణ

ఒక్కసారిగా టాలీవుడ్ ఆమె పై మండిపడింది. సినిమా ఇండస్ట్రీని, సినిమా వల్ల వ్యక్తిగత జీవితాలను రాజకీయాలోకి లాగొద్దు అని ఫైర్ అవుతున్నారు. తాజాగా దీని పై  కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు.

Konda Surekha: అనుకోకుండా ఓ కుటుంబంపై నోరు జారా..  కొండా సురేఖ వివరణ
Konda Surekha
Rajeev Rayala
|

Updated on: Oct 03, 2024 | 9:47 AM

Share

సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీపై అలాగే నటి సమంత వ్యక్తిగత విషయాలు గురించి సంచలన ఆరోపణలు చేశారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఆమె పై మండిపడింది. సినిమా ఇండస్ట్రీని, సినిమా వల్ల వ్యక్తిగత జీవితాలను రాజకీయాలోకి లాగొద్దు అని ఫైర్ అవుతున్నారు. తాజాగా దీని పై  కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆవేదనతోనే విమర్శలు చేశా అని మంత్రి కొండా సురేఖ అన్నారు.

అలాగే  నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా.. కేటీఆర్‌ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు అని కొండా సురేఖ అన్నారు. అలాగే పరువునష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా.. అదే విధంగా అనుకోకుండా ఓ కుటుంబం పై నోరు జారాను అని చెప్పుకొచ్చారు కొండా సురేఖ. అలాగే “నాకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సమంత విడాకుల విషయంలో నేను చేసిన కామెంట్స్ ఉపసంహరించుకుంటూ ట్వీట్ చేశాను. కానీ.. కేటీఆర్ విషయంలో తగ్గేదేలేదు’ అని స్పష్టం చేశారు.

కాగా నాగచైతన్య-సమంత కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని నిన్న కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్ పై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, ప్రకాష్ రాజ్,  అఖిల్, నాగార్జున, అమల, మంచు లక్ష్మీ, చిరంజీవి, ఆర్జీవీ ఇలా అందరూ స్పందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు