Ayodhya temple: గోరంత సైజులో అయోధ్య రామమందిరం.. స్వర్ణకారుడి అద్భుత సృష్టి

| Edited By: Narender Vaitla

Jan 20, 2024 | 4:26 PM

బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఏ నోట విన్నా ఆయోధ్య భవ్యరామమందిరం అంశమే వినిపిస్తోంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా బంగారు భవ్యరామ...

Ayodhya temple: గోరంత సైజులో అయోధ్య రామమందిరం.. స్వర్ణకారుడి అద్భుత సృష్టి
Ayodhya Temple
Follow us on

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేళ దేశం మొత్తం రామనామస్మరణలో మునిగిపోతోంది. బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఏ నోట విన్నా ఆయోధ్య భవ్యరామమందిరం అంశమే వినిపిస్తోంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా బంగారు భవ్యరామ మందిరాన్ని రూపొందించాడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి.

2.730 మిల్లి గ్రాములతో బంగారు భవ్వ రామ మందిరం..

1.5 సెంమీ ఎత్తు, 1.75 సెంమీ వెడల్పు, 2.75 సెంమీ పొడవుతో భవ్య రామమందిర ఆలయాన్ని 2.730 మిల్లి గ్రాముల బంగారంతో తయారు చేశాడు. గోపి రూపొందించిన గోరంత రామ మందిరంలో 20గోపురాలు, 108స్థంబాలు, ప్రత్యేకంగా విల్లును తయారు చేసి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అంతే కాకుండా ఇంత చిన్న మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని సైతం పొందుపరిచి ఔర అనిపించాడు. సుమారు నెలరోజుల పాటు శ్రమించి భవ్యరామమందిరాన్ని గోరంత సూక్ష్మంగా రూపొందించి తన కళానైపుణ్యంతో సత్తా చాటాడు. ప్రధాని మోదీ వద్ద ఈ కళాఖండాన్ని ప్రదరించాలని కోరుకుంటున్నానని గోపి తెలిపాడు.

 

సూక్ష్మకళాకారుడిగా సత్తాచాటుతున్న గోపి..

ఇటీవలే బంగారంతో టీట్వంటీ వరల్డ్ కప్ నమూనాను తయారు చేశాడు గోపి. వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ విజయం సాధించాలన్న కాంక్షతో కేవలం 110మి.గ్రా బంగారంతో బియ్యపుగింజ సైజులో వరల్డ్ కప్, స్టేడియం, పిచ్, వికెట్లను తయారు చేశాడు. అలాగే సూక్ష్మ జాతీయ జెండా, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో పాటు ఎన్నో వస్తువులను రూపొందించాడు. భవిష్యత్ లో కూడా ఇలాంటి సూక్ష్మ నమూనాలను తయారు చేస్తానని గోపి చెబుతున్నాడు. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే నల్లమల పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగేలా సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. స్వర్ణకారుడు గోపి అద్భుత నైపుణ్యాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. సందర్భానికి అనుగుణంగా రూపొందిస్తున్న సూక్ష్మ నమునాలును మొచ్చుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..