AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో మిగిలిపోయి, పడేసే వాటితో ఇలా చేస్తే.. మల్లె మొక్క గుబురుగా, పచ్చగా పూలు పూయాల్సిందే..

మల్లె మొక్క మొగ్గలు రాక మొండికేస్తుందా? ఎండాకాలంలో మల్లెలు విపరీతంగా పూయాలంటే ఏం చేయాలి? ఇంట్లో లభించే వస్తువులతోనే మల్లె మొక్కలకు ప్రాణం పోసే చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఇదిగో ఇలా..

ఇంట్లో మిగిలిపోయి, పడేసే వాటితో ఇలా చేస్తే.. మల్లె మొక్క గుబురుగా, పచ్చగా పూలు పూయాల్సిందే..
Lifestyle
Ravi Kiran
|

Updated on: May 08, 2026 | 12:39 PM

Share

ఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లె పూల సువాసన మన మనసును ఆహ్లాదపరుస్తుంది. అయితే చాలామంది తమ మల్లె మొక్కలు సరిగ్గా పూయడం లేదని బాధపడుతుంటారు. మల్లె మొక్కకు ఏప్రిల్, మే నెలల్లో వచ్చే విపరీతమైన ఎండలను తట్టుకునే శక్తిని ఇస్తూనే, విపరీతంగా పూలు పూయించే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకోండి. ముందుగా నీరు చాలా ముఖ్యం. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు త్వరగా ఎండిపోతాయి. కాబట్టి ఉదయం, సాయంత్రం రెండు పూటలా నీరు పోయాలి. నీరు సరిపోకపోతే మొక్క తలలు వాల్చేస్తుంది.

రెండోది సాఫ్ట్ ప్రూనింగ్. పువ్వులు పూసి ఎండిపోయిన కొమ్మలను ఒక ఆకు కింద వరకు కట్ చేయాలి. మల్లె మొక్కలకు ఎప్పుడూ కొత్తగా వచ్చే చిగుర్లకే పూలు వస్తాయి. పాత కొమ్మలకు పూలు రావు, కాబట్టి ట్రిమ్మింగ్ చేయడం తప్పనిసరి. ఇక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే.. ఇంట్లో వృధాగా పడేసే పదార్థాలతో ఒక లిక్విడ్ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఒక బకెట్ నీటిలో బియ్యం కడిగిన నీరు, ఉల్లిపాయ పొట్టు నానబెట్టిన నీరు, లేదా పాత మజ్జిగను కలిపి ఒక రోజంతా పులియబెట్టాలి.

ఈ మిశ్రమాన్ని మళ్ళీ సాధారణ నీటితో డైల్యూట్ చేసి(పలచగా చేసి) మొక్కలకు ఇవ్వాలి. దీనివల్ల మొక్కకు కావలసిన నైట్రోజన్, పొటాషియం అందుతాయి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పుడూ సాయంత్రం వేళల్లో మాత్రమే ఇవ్వాలి. ఉదయం పూట ఇస్తే ఎండకు ఆవిరి అయిపోతాయి. సాయంత్రం ఇస్తే రాత్రంతా మొక్క ఆ పోషకాలను నిదానంగా గ్రహిస్తుంది. ఇలా వారం లేదా పది రోజులకు ఒకసారి చేస్తూ, ఎప్పటికప్పుడు ఎండు కొమ్మలను తొలగిస్తుంటే.. మీ మల్లె మొక్క మొగ్గలతో కళకళలాడుతుంది. ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా మొక్క ఆరోగ్యంగా పెరిగి మీకు నిండుగా పూలను ఇస్తుంది.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర