Telangana: దారుణం.. తల్లి కొడుకులపై కత్తులతో విచక్షణరహిత దాడి

వరంగల్ శివారులోని కీర్తినగర్ కాలనీలో దారుణం జరిగింది. తల్లి కొడుకులపై కొంతమంది వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలైన తల్లి కొడుకులు ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Telangana: దారుణం.. తల్లి కొడుకులపై కత్తులతో విచక్షణరహిత దాడి
Indiscriminate Attack
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 17, 2024 | 8:24 AM

వరంగల్ శివారులోని కీర్తినగర్ కాలనీలో దారుణం జరిగింది. తల్లి కొడుకులపై కొంతమంది వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలైన తల్లి కొడుకులు ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడికి ప్రేమ వివాహారమే కారణమని తెలుస్తోంది. ప్రియురాలి తండ్రి, సోదరులు యువకుడితో పాటు అతని తల్లిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వరంగల్ నగరంలోని కీర్తినగర్ కాలనీలో చోటు చేసుకుంది.

కీర్తినగర్ కాలనీకి చెందిన షరీఫ్ అనే వ్యక్తి కుమార్తె, అదే కాలనీలో ఉంటున్న ఆద్నాన్ అలీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో యూసఫ్ షరీఫ్ తన కుటుంబంతో కలిసి హనుమకొండకు మకాం మార్చి నివాసం ఉంటున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం అద్నాన్అలీ హనుమకొండలో వారి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. తాను ప్రేమిస్తున్న యువతితో గొడవ పడి ఆమె ఫోన్‌ను తీసుకెళ్లాడు.

విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. కీర్తినగర్ కాలనీకి వచ్చి అద్నాన్ ఆలీ తోపాటు అతని తల్లి సమీనాపై కత్తి, గొడ్డలితో దాడి చేశారు. వారు కేకలు వేయడంతో పారిపోయారు. బాధితులను స్థానికులు వెంటనే 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి పూర్తిగా ప్రేమ వివాహారమే కారణమని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..