AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ఇల్లు లేని వారికి రేవంత్ సర్కార్ జాక్‌పాట్ ఆఫర్.. దరఖాస్తు చేస్కోండి..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించనుంది. కేవలం రూ.3.50 లక్షలకే మీరు ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. నగరాల్లోని పేదలకు ఇది వరంగా చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లో భవన సముదాయాలు నిర్మించి వాటిల్లో ఫ్లాట్లను ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు కేటాయించనుంది.

Telangana: కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ఇల్లు లేని వారికి రేవంత్ సర్కార్ జాక్‌పాట్ ఆఫర్.. దరఖాస్తు చేస్కోండి..
Indiramma Housing Scheme
Venkatrao Lella
|

Updated on: Nov 13, 2026 | 3:38 PM

Share

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. అర్హులందరికీ ఇళ్ల కేటాయింపులు చేస్తోంది. ఇప్పటికే లక్షలాది ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉంది. అయితే మరింతమంది అర్హులకు ప్రస్తుతం ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. ఈ సారి కొత్త విధానాన్ని అవలంభిస్తోంది. అపార్ట్‌మెంట్లను నిర్మించి అందులో ఫ్లాట్లను అందించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తున్నన్న ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా మిగతా కార్పొరేషన్లలో కూడా ఇదే తరహాలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందులో ఫ్లాట్లను అర్హులకు కేటాయించనుంది. అయితే కేవలం రూ.3.50 లక్షలకే వీటిని అందించనుంది. దీంతో రూ.3.50 లక్షలు కడితే ప్లాట్‌ను లబ్దిదారులకు సొంతం చేసుకోవచ్చు.

నాలుగు విడతలుగా చెల్లించే ఆప్షన్

రూ.3.50 లక్షలను ఒకేసారి కాకుండా నాలుగు విడతలుగా లబ్దిదారులు చెల్లించవచ్చు. తొలుత మంజూరు చేసే ప్రక్రియ సమయంలో రూ.లక్ష, ఆర్‌సీసీ నిర్మాణప్పుడు రూ.లక్ష, ఫినిషింగ్ పనుల సమయంలో రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.50 వేలు ప్లాట్ కేటాయింపు సమయంలో చెల్లిస్తే ఫ్లాట్ మీ సొంతమవుతుంది. సాధారణంగా నగరాలు, పట్టణాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. అయితే ప్రభుత్వం నుంచి రూ.3.50 లక్షలకే ఫ్లాట్ పొందవచ్చు. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వరంగా చెప్పవచ్చు. తొలి విడతలో ఐదు కార్పొరేషన్ల పరిధిలో 2400 ప్లాట్లను కేటాయించనున్నారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తొలి విడతలో వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణం చేపట్టనుండగా.. అనంతరం రెండో విడతలో మిగతా కార్పొరేషన్లలో కూడా చేపట్టనున్నారు.

రూ.100 చెల్లిస్తే చాలు..

మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100గా ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అనంతరం టోకెన్ అడ్వాన్స్ కింద రూ.10 వేలు చెల్లించాలి. ఒకవేళ లక్కీడ్రాలో మీకు ఫ్లాట్ రాకపోతే ఈ సొమ్మును రీఫండ్ చేస్తారు. దరఖాస్తుదారులకు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా సొంతిల్లు ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. ప్రభుత్వం కేటాయించిన ఇంటిని పదేళ్ల వరకు విక్రయించుకోవడం లేదా అద్దెకు ఇవ్వడం కుదరదు. అలాగే ఈ ఫ్లాట్ తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి ఎలాంటి రుణాలు తీసుకోకూడదు. ఫ్లాట్ వచ్చినవారికి అన్‌డివైడెడ్ షేర్‌లో భాగంగా స్థలం ఉచితంగా లభించనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో కేవలం ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. కార్పొరేషన్‌ను యూనిట్‌గా తీసుకుని దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Follow Us