Hyderabad: వాహనదారులకు అలర్ట్.. నగరంలో మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు

|

May 20, 2022 | 8:19 AM

హైదరాబాద్(Hyderabad) లో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏదైనా సమస్య తలెత్తి వాహనాలు ఆగిపోతే.. వాటి వెనకే వందలాది వాహనాలు బారులు తీరుతాయి. నగరంలో మెట్రో రైలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు...

Hyderabad: వాహనదారులకు అలర్ట్.. నగరంలో మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic
Follow us on

హైదరాబాద్(Hyderabad) లో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏదైనా సమస్య తలెత్తి వాహనాలు ఆగిపోతే.. వాటి వెనకే వందలాది వాహనాలు బారులు తీరుతాయి. నగరంలో మెట్రో రైలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు కొంత తగ్గినప్పుటికీ.. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు.ఈ తరుణంలో రోడ్ల మధ్యలో ఏవైనా నిర్మాణాలు చేపడితే ట్రాఫిక్ ఇబ్బందుల గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అంబర్ పేట పరిధిలో పై వంతెన నిర్మాణం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు. గోల్నాక(Golnaka) నుంచి అంబర్ పేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. వాహనదారులు ఈ మార్పులను గమనించాసని కోరారు. ఉప్పల్ వైపు నుంచి వచ్చే వాహనదారులు అంబర్ పేట శ్రీరామణ థియేటర్ సర్కిల్ నుంచి, అలీ కేఫ్ చౌరస్తా నుంచి జిందాతిలిస్మాత్ రోడ్డును కలుపుకొని గోల్నాక వైపు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

చాదర్ఘాట్ వైపు నుండి వచ్చే వాహనదారులు కాచిగూడ నింబోలి అడ్డ నుంచి టూరిస్ట్ హోటల్ వైపు నుండి వెళ్తూ ఫీవర్ ఆస్పత్రి తిలక్ నగర్ మీదుగా చే నెంబర్ సర్కిల్ వైపు వచ్చి తిరిగి రామంతాపూర్ రోడ్డుకు కలవాల్సి ఉంటుందని జాయింట్ సీపీ ఏ.వీ.రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు ట్రయల్ రన్ చేసి ఇబ్బందులను గుర్తించి వాటిని మెరుగు పరచామని సీపీ తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు దాదాపు మూడు నెలల వరకు కొనసాగుతాయని వాహనదారులు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. .

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Sivakarthikeyan: ‘మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం..ఆయనకి నా సినిమా విజయాన్ని అంకితం చేస్తున్నా’: శివకార్తికేయన్

PM Modi Japan Tour: ఈ నెల 24న జపాన్‌కు పయనం కానున్న ప్రధాని మోడీ.. క్వాడ్ నేతలతో సమావేశం