Hyderabad: గురునానక్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్.. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు

|

Dec 24, 2024 | 1:50 PM

గురునానక్‌ కాలేజీలో విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీగా మారింది. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అసలు వీళ్లు ఎక్కడికి వెళ్లారు...? ఎవరి చెప్పకుండా పారిపోయారా..? లేదంటే కిడ్నాప్‌కు గురయ్యారా..? కాలేజ్ యాజమాన్య ఏమంటుంది... పోలీసుల గాలింపు ఎలా సాగుతుంది..? డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Hyderabad: గురునానక్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్.. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు
Gurunanak Engineering College
Follow us on

రంగారెడ్డి జల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో 10రోజుల వ్యవధిలోనే ముగ్గురు అదృశ్యమవడం తీవ్రకలకలం రేపుతోంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు మిస్సింగ్ అవ్వడం అటు తల్లిదండ్రులలో, ఇటు కాలేజీ యాజమాన్యంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు అదృశ్యమైనట్లు కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 14న 17ఏళ్ల కొత్తగడి విష్ణు మిస్సైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18న 17 ఏళ్ల కొంగరి శివాని అదృశ్యమైనట్లు కాలేజీ జనరల్ మేనేజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 19 ఏళ్ల ఉప్పల పావని ఈనెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని తల్లి ఉప్పల కృష్ణవేణి పిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం పిర్యాదు మేరకు పోలీసూలు కేసు నమోదు చేసుకొని వారి కోసం గాలిస్తున్నారు.

10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమవ్వడంతో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కాలేజ్‌కి ఫోన్‌ చేసి వివరాలు ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..