తంగేడుపూలు- బతుకమ్మల కమ్మని ముఖాల వెలుగు నింపు పూలు

తెలంగాణలో బతుకమ్మ గొప్ప వేడుక.. అచ్చంగా జానపదుల పండుగ. ప్రాచీనమైన పండుగ. కావ్యాల్లోనూ, చరిత్ర పుస్తకాల్లోనో లేకపోయినంత మాత్రానా బతుకమ్మను ఇటీవలి పండుగగా చెప్పుకోవడానికి వీలులేదు.

తంగేడుపూలు- బతుకమ్మల కమ్మని ముఖాల వెలుగు నింపు పూలు
Follow us

|

Updated on: Oct 23, 2020 | 4:31 PM

తెలంగాణలో బతుకమ్మ గొప్ప వేడుక.. అచ్చంగా జానపదుల పండుగ. ప్రాచీనమైన పండుగ. కావ్యాల్లోనూ, చరిత్ర పుస్తకాల్లోనో లేకపోయినంత మాత్రానా బతుకమ్మను ఇటీవలి పండుగగా చెప్పుకోవడానికి వీలులేదు. చరిత్రలో చాలా అంశాలకు చోటు దొరక్కపోవచ్చు. దానికి రకరకాల కారణాలుంటాయి.. జానపదులకు ఎంతో ఆరాధనీయమైన తంగెడుపూల ప్రస్తావన ఎందుకో కావ్యాల్లో కనిపించదు. నాగరికులూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ బంగరుపూల సోయగాన్ని చూడాలంటే కాపు కన్నెల ముద్ద కొప్పుల్లో చూడాలి. వాసన లేకపోతేనేం… వలపు బాసలు నేర్చిన పూలు కాబట్టే స్త్రీల సిగలో కాపురముంటున్నాయి. తంగేడుపూలకు బతుకమ్మకు విడదీయరాని సంబంధం వుంది. తంగేడువనం కవితా సంపుటి చదివితే తంగేడుపూల గొప్పదనం తెలుస్తుంది.. తంగేడుపూల పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన ఓ కథ వాడుకలో వుంది… పల్లె కుటుంబంలో పుట్టిన ఓ చిన్నారి తన మంచితనంతో…కలుపుగోలుతనంతో ఊళ్లో వాళ్లందిరికి తలలో నాలుక అయింది… ఆ ఆడబిడ్డ తమ ఇంట్లో పుట్టి వుంటే బాగుండేది కదా అని అనుకునేవారు.. ఆ అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు.. అక్కడ తోడికొడలుతో ఈమెకు తరచూ గొడవలు జరిగేవి… ఓసారి స్నానాల తర్వాత పొరపాటున తన తోడికోడలు చీర కట్టుకుంది… ఇది సహించిన ఆమె ఆ అమ్మాయిని గొంతు నులిమి చెరువులో పడేసి వెళుతుంది… చనిపోయిన ఆ అమ్మాయి తన భర్తకు కలలకొచ్చి చెరువుగట్టు మీదున్న తంగేడుచెట్టు దగ్గర తాను వున్నానని చెబుతుంది… అప్పట్నుంచి ఆ అమ్మాయి మరణించిన చోటునున్న తంగేడు చెట్టుకు ప్రజలు పూజలు చేయడం మొదలు పెట్టారు… కాలక్రమంలో తంగేడుపూలతో బతుకమ్మను పేర్చడం తప్పనిసరి సంప్రదాయమైంది..

బతుకమ్మ పండుగ ఆవిర్భావినకి సంబంధించి కాల నిర్ధారణ చేయడం కష్టం. జానపద రచనకు ఆచారానికి కాల నిర్ధారణ చేయడం ఇప్పుడున్న ఆధారాలు సరిపోవు. అయితే పండుగ నేపథ్యాన్ని వివరించే నాలుగైదు కథనాలు బతుకమ్మ పాటల్లోనే వున్నాయి. ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని దీవించారని, అందుకనే ఇది మహిళలకు సంబంధించిన పండుగ అయ్యిందని చెబుతారు. మరో కథలో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగుడనే రాజు ఆయన భార్య సత్యవతి వంద నోములు నోచి వంద మంది పుత్రులకు జన్మనిచ్చారు. యుద్ధంలో వారంతా అమరులయ్యారు. ఆవేదన చెందిన రాజదంపతులు లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలై సత్యవతి బిడ్డగా జన్మిస్తుంది. బతికిన ఈ తల్లి బతుకమ్మ అవుతుందనే మహర్షుల ఆశీర్వచనల ప్రకారం అప్పట్నుంచి ఆమె బతుకమ్మ అయింది. ఓ రాజు సంతానం కోసం పూజలు చేశాడట! లక్ష్మి దేవి అనుగ్రహంతో ఆయన భార్య గర్భవతై కూతుర్ని కనిందట! అనేక గండాల్నుంచి గట్టెక్కింది కాబట్టి పాపకు బతుకమ్మా అని పేరు పెట్టారట! అప్పట్నుంచి యువతులు బతుకమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తుందట! అసలు బతుకమ్మ పండుగకు, నవరాత్రి ఉత్సవాలకు కూడా దగ్గర సంబంధం వుంది! మహిషాసురునితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసిపోతుంది. ఆ అలసటతోనే సుప్తావస్థలోకి వెళ్లిపోతుంది. ఆమెకు సేద తీర్చి తిరిగి యుథాస్థితికి తీసుకురావడానికి స్త్రీలు సేవలు చేసి పాటలు పాడతారు. తొమ్మిదో రోజుకు ఆమె అలసట తీరుతుంది. వెంటనే మహిషాసురుడ్ని సంహరించి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. ఆ జగన్మాత జనులకు జీవితాన్ని, బతుకునూ ప్రసాదించింది కాబట్టే గ్రామీణులు ఆమెను బతుకమ్మగా పిల్చుకుంటున్నారనేది ఓ కథ కూడా ప్రచారంలో వుంది.

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..
మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో