KTR: ఒవైసీ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. కీలక కామెంట్స్

|

Feb 03, 2022 | 9:10 PM

KTR: ఒవైసీ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం భాయ్‌ అంటూ..KTR: ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

KTR: ఒవైసీ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. కీలక కామెంట్స్
Follow us on

KTR: ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఒవైసీ క్షేమంగా బయటపడ్డారు. మీరట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ కాల్పలు జరిగాయి. తన కాన్వాయ్‌పై కాల్పులు జరిగినట్లు ఒవైసీ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఒవైసీ కాన్వాయ్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఈ దాడిని పలువురు నేతలు ఖండిస్తున్నారు.

తాజాగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా దాడి ఘటపై స్పందించారు. అసదుద్దీన్‌ పోస్ట్‌ను రీట్వీట్‌ చేసి మంత్రి.. ‘అసద్‌ భాయ్‌ మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం. అసదుద్దీన్‌పై జరిగిన ఈ చర్య చాలా దారుణమైంది. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే తనపై జరిగిన దాడిని వివరిస్తూ అసదుద్దీన్‌.. ‘యూపీ మీరట్‌లోని కిథౌర్​లో ఎన్నికల సంబంధిత కార్యక్రమం ముగించుకుని ఢిల్లీ బయలుదేరాను. చిజారసీ టోల్​గేట్​ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు, నలుగురు ఉన్నారు’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Also Read: AP Job Mela: ఏపీలో రేపు జాబ్‌ మేళా.. ఇంటర్వ్యూ ఎక్కడ జరగనుంది.? ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి.?

AP CM YS Jagan: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు