AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. నగరంలో వరల్డ్ బిగ్గెస్ట్ స్విస్ మాల్.. ప్రపంచంలో ఇదే తొలిసారి..

హైదరాబాద్‌లో మరో పెద్ద మాల్ ఏర్పాటు కానుంది. ప్రపంచంలో ఎక్కడా ఏర్పాటు చేయని స్విస్ మాల్‌ను నగరంలో ఏర్పాటు చేసేందుకు అడుగులు పడ్డాయి. ఈ మేరకు మాల్ ఏర్పాటుపై దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. నగరంలో వరల్డ్ బిగ్గెస్ట్ స్విస్ మాల్.. ప్రపంచంలో ఇదే తొలిసారి..
Swis Mal Hyderabad
Venkatrao Lella
|

Updated on: Jan 22, 2026 | 1:58 PM

Share

హైదరాబాద్‌లో ఇప్పటికే ఇనార్టిట్, లూలూ, మంజీరా, నెక్సస్ లాంటి పెద్ద మాల్స్ ఉండగా.. ఇటీవల కూకట్‌పల్లిలో సిటీలో అతి పెద్ద మాల్ లేక్‌షోర్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ మాల్స్ నగరవాసులకు షాపింగ్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచుతుండగా.. రానున్న రోజుల్లో మరో పెద్ద మాల్ రానుంది. అదే స్విల్ మాల్. ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎక్కడా లేని స్విస్ మాల్ అందుబాటులో ఏర్పాటు కానుంది. ఇందులో కేవలం షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌నే కాకుండా స్విస్ విద్య, నైపుణ్య, సంస్కృతికి ట్రైనింగ్ కేంద్రంగా మారనుంది. హైదరాబాద్‌లో ఈ మాల్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్‌లో స్విస్ మాల్

వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌కు చెందిన వాడ్ కౌన్సిల్ చీఫ్ మినిస్టర్ క్రిస్టెల్ లూయిసియర్ బ్రోడార్డ్‌తో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ కోరగా.. వెంటనే స్విస్ బృందం అంగీకరించింది. హైదరాబాద్‌లో స్విస్ మాల్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని ఈ మాల్ తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు కావడంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.

కీలక ఒప్పందాలు

ఇక స్విస్ ప్రతినిధులతో జరిగిన భేటీలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఫుట్ బాల్ ట్రైనింగ్, అంతర్జాతీయ సౌకర్యాలు కల్పించడంపై స్విస్ భాగస్వామ్యాన్ని రేవంత్ కోరారు. ఇందుకు స్విస్ ప్రతినిధులు ముందుకొచ్చారు. అలాగే హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, నైపుణ్యాభివృద్దిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఇక రిటైల్, లైఫ్ సైనెన్స్ రంగంలో పలు ఒప్పందాలు జరిగాయి. అటు స్విస్ మాల్ ఏర్పాటుతో హైదరాబాద్ రిటైల్ హాబ్‌గా మారుతుందని రేవంత్ రెడ్డి ఆశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా గ్లోబల్ రిటైల్ హాబ్‌గా హైదరాబాద్‌ను మార్చుతామన్నారు. త్వరలోనే స్విస్ బృందం హైదరాబాద్ పర్యటనకు రానుంది. మాల్ ఏర్పాటుపై చర్చలు జరపడంతో పాటు స్థలం పరిశీలన చేపట్టనుంది. ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అటు దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..