AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fertility Scam: అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చింది. చిన్నారి శిశువులను అడ్డుపెట్టుకుని పశువులా బిజినెస్‌ చేసింది. అంగడి బొమ్మల్లా...పసికందులను అమ్మకానికి పెట్టింది. పిల్లలను షాపులో చాక్లెట్లు, బిస్కెట్లలా ట్రీట్‌ చేసింది. పైకి IVF, సరోగసీ అంటూ కవరింగ్‌ కలరింగ్‌ ఇచ్చి...అమ్మ కావాలనే ఆశలతో వచ్చినవాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. సంతలో సరుకుల లెక్కన శిశువులను అమ్మేసింది.

Fertility Scam: అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.
Dr. Namrata's Fertility Scam
Shaik Madar Saheb
|

Updated on: Jul 30, 2025 | 9:37 AM

Share

అమ్మా అనిపించుకోవాలనే ఆవేదన. తండ్రి అని పిలిపించుకోవాలనే తపన. అలా పిలిపించుకోలేక తల్లడిల్లే వివాహిత జంటలే డాక్టర్‌ నమ్రత టార్గెట్‌. కళేబరాల కోసం రాబందులు కాచుకు కూర్చున్నట్లు.. పిల్లల కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు వచ్చే దంపతులను కాసుల కోసం పీల్చి పీడించి పిప్పి పిప్పి చేసేది ఈ క్రిమినల్‌ డాక్టర్‌. పిల్లల పుట్టక నరకం అనుభవిస్తూ.. తన దగ్గరకు వచ్చిన జంటల ఎమోషన్స్‌తో ప్లే చేసింది డాక్టర్‌ నమ్రత.. వాళ్లతో వందకు వంద శాతం బిజినెస్‌ చేసింది. ఆమె దృష్టిలో బిడ్డలంటే.. అంగట్లో దొరికే బొమ్మలే. అమ్మ కావాలని వచ్చినవాళ్లను బొమ్మలుగా చేసి ఆడుకుంది. తన దగ్గరకు వచ్చిన ప్రతివాళ్లకు సరోగసీనే పరిష్కారం అని నమ్మించి, ఎవరి బిడ్డలనో తెచ్చి వాళ్లకు అంటగట్టేది. 2014లో NRI దంపతులను ఇలాగే మోసం చేసింది. వాళ్లు తిరిగి అమెరికా వెళ్లే క్రమంలో DNA టెస్ట్‌లో మ్యాచింగ్‌ కాకపోవడంతో నమ్రత నయవంచన బయటపడింది. వాళ్లు వెళ్లి నిలదీస్తే.. మరో బిడ్డను ఫ్రీగా ఇస్తానని దగుల్బాజీ ఆఫర్‌ చేసిన లోఫర్‌ చరిత్ర ఈ నయవంచకిది. డాక్టర్‌ నమ్రత.. అసలామె మనిషే కాదు.. మనీ మెషీన్‌. ఈ మాట అంటున్నది మేము కాదు.. ఓ అభాగ్యురాలు. ఆమె దగ్గర చికిత్స తీసుకున్న బాధితురాలు. తమలా ఎందరి ఉసురో పోసుకుంది డాక్టర్‌ నమ్రత అంటోంది బాధితురాలు.

నమ్రత నయవంచనతో కుమిలిపోతున్న జంటలు

తండ్రి ఎవరో తెలియక, బిడ్డ ఎవరిదో అర్థం కాక.. తల్లడిల్లిపోయే కపుల్స్‌.. సృష్టి ఖాతాలో చాలమందే ఉన్నారు. DNA చేయించుకోలేక, ఆత్మసంతృప్తితో బతకలేక నిత్యం రోదిస్తూ.. బతుకీడుస్తూ బతుకుతున్నవాళ్లెందరో. ఇన్ని నేరాలు ఘోరాలు చేసి కూడా, తానేం తప్పు చేయలేదని నిస్సిగ్గుగా చెబుతోంది నమ్రత. బెయిల్‌ కోసం అత్యంత హీనంగా దేబిరిస్తోంది. బిడ్డలు కావాలన్న వాళ్ల బలహీతను ఇలా క్యాష్‌ చేసుకుంది నమ్రత అని చెబుతున్నారు బాధితులు. పిల్లల కావాలన్న జంటలు కనిపిస్తే ఆమె పంట పండినట్లే అంటున్నారు వాళ్లు.

దంపతులకు వల.. దోచుకోవడమే కళగా బతికిన.. ఈ క్రిమినల్‌ డాక్టర్‌ని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..