AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!

పంజాబ్‌లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. 16.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఒక మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!
Car
Ravi Kiran
|

Updated on: Apr 08, 2026 | 9:23 PM

Share

పంజాబ్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మద్దతుతో నడుస్తున్న ఒక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పంజాబ్ పోలీసులు చేధించారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 16.8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఒక మహిళతో సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. అరెస్ట్ అయిన వారిని బల్విందర్ సింగ్(కపుర్తలా), సుమన్ ప్రీత్ కౌర్, హర్పాల్ సింగ్, జస్కరణ్‌బీర్ సింగ్(అమృత్‌సర్)గా గుర్తించారు. వీరు మారుతీ బలెనో కారులో డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకున్నారు.

ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..

ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక పాకిస్థాన్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్ల హస్తం ఉందని ప్రాథమిక విచారణలో తేలినట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. ఈ హెరాయిన్ నిల్వలను అమృత్‌సర్ సరిహద్దు ప్రాంతం నుంచి సేకరించి, చండీగఢ్‌లో డెలివరీ చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు. కాగా, నిందితుల వద్ద నుంచి డ్రగ్స్‌తో పాటు ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠాకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? గతంలో ఇలాగే ఎన్నిసార్లు డ్రగ్స్ సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

Follow Us
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి