
హైదరాబాద్, మే 29: హైదరాబాద్‌లో దశాబ్దం పైగా పోలీసులకు చిక్కకుండా తిరిగిన కేసుల్లో అత్యంత ప్రమాదకరమైన రౌడీ షీటర్‌ను సుల్తాన్ బజార్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విష్ణవ్ కిషన్ దాస్ అలియాస్ వి. గణేష్ మహరాజ్ (Vishwav Kishan Das @ V. Ganesh Maharaj)ను మలక్‌పేటలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నేర చరిత్ర — 21 కేసులు, హత్య సహా ఘోరమైన నేరాలు..నిందితుడిపై 1999 నుండే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కొనసాగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు ఇతర జిల్లాల్లో మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సెక్షన్ 302 (హత్య), 307 (హత్యాయత్నం), దొంగతనం, ఆయుధాల చట్టం ఉల్లంఘన వంటి ఘోరమైన నేరాలున్నాయి.
సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 248/2010 (సెక్షన్ 302, 201, 379 IPC) కేసులో రెండవ నిందితుడైన విష్ణవ్ 2010 నవంబర్‌లో నాంపల్లి ACMM కోర్టు ముందు లొంగిపోయాడు. 2012 మే 2న బెయిల్‌పై విడుదలయ్యాక కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉండిపోయాడు. అంతకుముందు 2003 నుండి కూడా పోలీసులకు దొరకకుండా మరిన్ని నేరాలకు పాల్పడ్డాడు.పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడానికి నిందితుడు తెలివిగా తన ఆధార్ కార్డు సహా పత్రాల్లో పేరును ‘వైష్ణవ్ కిషన్ దాస్’ నుండి ‘వైష్ణవ్ గణేష్ మహరాజ్’గా మార్చుకున్నాడు. నకిలీ పత్రాల ద్వారా గుర్తింపు మార్చుకున్న అంశంపై పోలీసులు విడిగా మరో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటైంది. నిరంతర నిఘా, క్షేత్రస్థాయి విచారణ ద్వారా నిందితుడు హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివసిస్తున్నాడని తెలిసింది. ఈ సమాచారంతో 27 జూన్ 2026న మలక్‌పేటపై సుల్తాన్ బజార్ పోలీసులు దాడి చేసి పరారీలో ఉన్న రౌడీ షీటర్‌ను విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో ఉన్న ఈ మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ వైష్ణవ్ దాస్ కత్తులతో నరికి చంపి అవే చేత్తో ఆశీర్వచనాలు సైతం ఇచ్చాడు. 14 ఏళ్లుగా పోలీసుల నుండి తపించుకుని తిరుగుతున్ వైష్ణవ దాస్ అరెస్ట్ చేసి కటకటాల వెనుక వేశారు. 1991 నుండి వైష్ణవ్ గణేష్ గా పేరు మార్చుకుని గుండు గీయించుకుని దారుణాలకు పాల్పడుతున్నాడు. 2012 లో సొంత అన్న ను హత్య చేసి ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన వైష్ణవ్ అప్పటినుండి కోర్టు విచారణలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టి తప్పించుకు తిరుగుతున్నాడు. తనని ఎవరు గుర్తుపట్టకుండా కొత్త పేరుతో ఆధార్ కార్డు సైతం వైష్ణవ్ తెచ్చుకున్నాడు. పూజారి వేషం ధరించి , గుండు గీయించి మలక్పేట్ లో తిరుగుతున్న వైష్ణవ్ ను పక్కగా నిఘా పెట్టి సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.