Allu Arjun: నేడు అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు.. బన్నీకి ఊరట లభించేనా.?

|

Jan 03, 2025 | 9:13 AM

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. బన్నీ బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇవాళ తీర్పును వెల్లడించనుంది. మరి చూడాలి.. బన్నీకి ఇవాళ ఊరట లభించేనో.. లేదో..

Allu Arjun: నేడు అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు.. బన్నీకి ఊరట లభించేనా.?
Allu Arjun
Follow us on

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగియడంతో నేడు తీర్పు ఇవ్వనుంది. దాంతో.. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇక.. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో.. ఆమె మృతికి అల్లు అర్జునే కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు, అల్లు అర్జున్‌ తరపు లాయర్ల వాదనలు పూర్తవడంతో నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించబోతోంది. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.

మరోవైపు డిసెంబర్ 30వ తేదీన అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. ఆ సమయంలో అల్లు అర్జున్ వేసిన బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసుక్యూటర్ కోర్టును కోరారు. ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధాన కారణం అంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు PP. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. బన్నీకి బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే పోలీస్ విచారణకు సహకరించరని.. అయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ని కొట్టివేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.

అదే సమయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు నిరంజన్ రెడ్డి. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదన్నారు. BNS సెక్షన్ 105 అల్లు అర్జున్‌కు వర్తించదు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఇక చూడాలి ఇవాళ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట లభించేనా.? లేదా.?

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి