MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష.. ఆ కేసు విషయంలో నాంపల్లి ప్ర‌త్యేక కోర్టు తీర్పు

|

Jan 29, 2021 | 6:04 PM

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు  నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఏడాది జైలు శిక్ష విదించింది.  బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో వివాదాస్పద వాఖ్యలు చేసిన నేపథ్యంలో గతంలో రాజాసింగ్‌పై కేసు నమోదైంది. 

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష.. ఆ కేసు విషయంలో నాంపల్లి ప్ర‌త్యేక కోర్టు తీర్పు
Follow us on

MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఏడాది జైలు శిక్ష విధించింది.  బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గతంలో రాజాసింగ్‌పై కేసు నమోదైంది. కేసును విచారించిన నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం.. తాజాగా జైలు శిక్ష విధించింది.

2016లో ఉస్మానియా యూనివర్సిటీ బీఫ్ ఫెస్టివల్లో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ చేస్తే… మరో దాద్రి అవుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పీఎస్‌కు తరలించారు. అక్కడ కూడా ఆయన అదే పదజాలం ఉపయోగించారు.  పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.  దీంతో సెక్షన్ 295 A కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఐదేళ్ల తర్వాత ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుపై బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజా సింగ్. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసుపై హైకోర్టు ఆశ్రయిస్తానని రాజా సింగ్ తెలిపారు.

 

Also Read:  Madanapalle double murder: మదనపల్లె మర్డర్స్.. తిరుపతి రుయాకు నిందితులు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?