ACB Caught Officers: ఒకే కేసులో ఏడున్నర లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎంపీడీవో అధికారులు..

|

Jan 29, 2021 | 3:51 PM

ACB Caught Officers: భూ సంబంధిత వ్యవహారంలో రూ. 7.5 లక్షల లంచం తీసుకుంటూ మహేశ్వరం ఎండీవో సీహెచ్ శ్రీనివాస్ సహా, మాన్సాన్‌పల్లి పంచాయతీ

ACB Caught Officers: ఒకే కేసులో ఏడున్నర లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎంపీడీవో అధికారులు..
Follow us on

ACB Caught Officers: భూ సంబంధిత వ్యవహారంలో రూ. 7.5 లక్షల లంచం తీసుకుంటూ మహేశ్వరం ఎండీవో సీహెచ్ శ్రీనివాస్ సహా, మాన్సాన్‌పల్లి పంచాయతీ కార్యదరి, గ్రామ సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఐదున్నర ఎకరాల భూమి లే అవుట్‌ కు అనుమతి ఇవ్వడం కోసం ఎంపీడీవో అధికారులు సహా, మాన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్.. వెంచర్ యజమానులను లంచం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధిత వ్యక్తులు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాగా.. ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు.

ముందుగా మహేశ్వరం ఎండీవో సీహెచ్ శ్రీనివాస్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తరువాత.. మాన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ భార్త, ఉప సర్పంచ్‌లు రూ. 5.5 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు మాన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Also read:

Vote for Note: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు.. కీలక ప్రకటన చేసిన న్యాయస్థానం..