ప్రతీ ఏడాదిలో లాగే ఈసారి కూడా అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా ఇప్పటికే శబరిమల ఆలయాన్ని తెరిచారు. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
కాచిగూడ నుంచి కడప మీదుగా కొల్లాంలకు ఈ లనెలలో 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14, 21, 28 తేదీల్లో 07133 నంబరు రైలు భక్తులకు అందుబాటులోకి రానుంది. కాచిగూడలో మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరే ఈ రైలు అదే రోజు రాత్రి 12.10 గంటలకు కడపకు చేరుకుంటుంది. ఇక కొట్టాయంకు చేరుకునే సరికి మరిసటి రోజు సాయంత్రం 6.50 గంటలు అవుతుంది.
ఇక తిరుగు ప్రయాణంలో 07134 నెంబర్ రైలు ఈనెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి తర్వాతి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు చేరుకుంటుంది. ఇక కాచి గూడకు వచ్చే సరికి రాత్రి 11.40 గంటలు అవుతుంది. అదే విధంగా ఈ నెల 19,26వ తేదీల్లో కాచిగూడ నుంచి 07135 నెంబర్ రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు కడపకు చేరుకుంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07136 నెంబర్ రైలు ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.50 గంటలకు కడపకు, 11.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఇక నాందేడ్ నుంచి కూడా ప్రత్యేక రైలును నడుపుతున్నారు. నాందేడ్ నుంచి ఈ నెల 16వ తేదీన 07139 నెంబర్ రైలు ఉదయం 8.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడపకు చేరుకుంటుంది. రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 18వ తేదీన 07140 నెంబర్ రైలు తెల్లవారు జామున 2.30 గంటలకు బయలు దేరి రాత్రి 11 గంటలకు కడపకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఇక మౌలాలీ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. మౌలాలీలో ఈనెల 23, 30వ తేదీన 07141 నంబరు రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాత రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడప, రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్ 2వ తేదీల్లో 07142 నంబర్ గల రైలు కొల్లాంలో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, తర్వాతరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మౌలాలీకి చేరుకుంటుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..