భూమి దక్షిణ ధ్రువం అంటార్కిటికా ఖండం అత్యంత శీతల ప్రాంతం. దక్షిణ మహాసముద్రంతో ముడిపడి ఉన్న ఈ ఖండంపై మానవుని మనుగడ కష్టం. శాటిలైట్స్ నుంచి స్పేస్ డేటా ఎక్కువ సేకరించడం అక్కడి గ్రౌండ్ స్టేషన్ నుంచి వీలు అవుతుంది. పోలార్ రీజియన్ లో ఉన్న అంటార్కిటికా నుంచి 10 కంటే ఎక్కువ ఆర్పిట్లు కనిపిస్తాయి. కానీ హైదరాబాద్ నుంచి అయితే కేవలం రెండు ఆర్బిట్స్ మాత్రమే కనిపిస్తాయి. ప్రపంచంలో మరెక్కడ ఇన్ని ఆర్బిట్స్ కనిపించవు. అందుకే ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు అక్కడ గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇస్రో కూడా అదే కోవలో ఉంది. మన శాస్త్రవేత్తలు అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ గ్రౌండ్ స్టేషన్ ఎలా ఉంటుంది.? అక్కడ ఫుడ్ ఎం తింటారు..? వీటన్నింటిని తెలిపేలా స్టూడెంట్స్ కోసం బిర్లా ప్లానిటోరియం దేశంలోనే తొలిసారిగా అంటార్కిటికా గ్రౌండ్ స్టేషన్ తో లైవ్ ఇంటరాక్షన్ ఎక్స్ పిరియన్స్ రూంను ప్రారంభించింది.
అంటార్కిటికా ప్రాంతంలో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ సమయంలో పగలు కేవలం అక్కడ రెండున్నర గంటలు మాత్రమే. కాగా మిగిలిన టైం అంతా చీకటి ఉంటుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన సైంటిస్టులు పనిచేస్తూ ఖగోళ సమాచారాన్ని చేరవేస్తున్నారు. అంటార్కిటికా లో ఇస్రో భారితి స్టేషన్ లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కోసం అంటార్కిటికా గ్రౌండ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి శాటిలైట్ ద్వారా డేటాను స్వీకరిస్తారు. 2013 నుంచి ఇక్కడ ఇస్రో గ్రౌండ్ స్టేషన్ నుంచి డేటాతో పలు నిర్ణయాల్లో కీలకంగా మారింది. ప్రకృతి విపత్తులు, వ్యవసాయం, సముద్రం, చేపల వేట, వాతావరణ మార్పులు వంటి సమాచారం వస్తోంది.
అలాంటి అంటార్కిటికాలో ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు హైదరాబాద్ నుంచి నేరుగా తొలిసారి కనెక్టివిటీ ఏర్పడింది. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు లైవ్ ఎక్స్ పిరియన్స్ ఇంటరాక్షన్ రూమ్ ను బిర్లా ప్లానిటోరియం స్పేస్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. దీనిద్వారా అక్కడ స్టేషన్ లోని నలుగురు సైంటిస్టులతో లైవ్ ఇంటరాక్షన్ అయ్యేలా బిర్లా ప్లానిటోరియం స్పేస్ మ్యూజియం, NRSC ప్రత్యేక రూంను ఏర్పాటు చేశాయి. దీంతో అక్కడి పరిస్థితులపై ఇక్కడి నుంచే విద్యార్థులు తెలుసుకోవడం, ఖగోళ విషయాల్లో పలు అంశాలపై అవగాహన పెంచుకునేలా ఉపయోగపడనుంది. విద్యార్థులకు సైన్స్ అండ్ ఖగోళ అంశాలపై అధ్యయానానికి దోహదం చేసేలా ఇస్రోతో కలిసి బిర్లా ప్లానిటోరియం ఈ సదుపాయన్ని ఏర్పాటు చేసింది. అంటార్కిటికా గ్రౌండ్ స్టేషన్ లోని ఇస్రో నలుగురు సైంటిస్టులు లిజు నాయక్, భోలేనాథ్, చిన్మయ్ కుమార్, సహల్ మహమ్మద్ నేరుగా బిర్లా ప్లానిటోరియం స్పేస్ మ్యూజియానికి లైవ్ లో కనెక్ట్ అయ్యారు. విద్యార్థులు, విజిటర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి.. అక్కడి శీతల పరిస్థితలను వివరించారు. గ్రౌండ్ స్టేషన్ కిటికీ తెరిచి అక్కడ మంచు పరిస్థితిను ప్రత్యక్షంగా చూపించారు. దీంతో హైదరాబాద్ లో ఉండి లైవ్ లో అంటార్కిటికా ఖండాన్ని చూసే వీలు విద్యార్థులకు కలిగింది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య ఎలా నివసిస్తున్నారు.. అన్ని రకాల ఆహార పదార్ధాలను ఫ్రోజన్ గా తీసుకెళ్లి తింటామని సైంటిస్టులు చెప్పారు. తీసుకెళ్లిన ముడిసరుకులతో కేక్స్, పాలకూర, పనీర్ వంటి వంటకాలు చేసకుంటున్నట్లు తెలిపారు. బయటికి వెళ్తే రెండు మూడు నిమిషాలు కూడా ఉండలేమని సైంటిస్టులు వివరించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్న విద్యార్థుల థ్రిల్ ఫీలయ్యారు.
హైదరాబాద్ లో ఉండి అంటార్కిటికా గురించి తెలుసుకోవడం, స్పేస్ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ కు అద్భుతమైన అవకాశాన్ని బిర్లా ప్లానిటోరియం అందిస్తోంది. బిర్లా ప్లానిటోరియం కు వెళ్లే అంటార్కిటికాలోని సైంటిస్టుల వీలు ఆధారంగా లైవ్ ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తామని నిర్వహకులు తెలిపారు.