AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అరెరె.. పేద, మధ్యతరగతి వర్గాలకు మరో దెబ్బ.. పైకి ఎగబాకిన టమోటా ధర

హైదరాబాద్‌లో టమోటా ధరలు మళ్లీ ఎగబాకాయి. కొద్ది రోజుల క్రితం కిలో రూ.20–30 ఉండగా, ఇప్పుడు హోల్‌సేల్‌లోనే రూ.60–70కు చేరాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో సరఫరా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల ..

Hyderabad: అరెరె.. పేద, మధ్యతరగతి వర్గాలకు మరో దెబ్బ.. పైకి ఎగబాకిన టమోటా ధర
Tomato
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2025 | 6:26 PM

Share

టమోటా ధరలు మరోసారి పైచూపు చూస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టమోటా ధర విపరీతంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం కిలో రూ.20 నుంచి 30 వరకు ఉండగా.. ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.60 నుంచి 70కి అమ్ముడవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో సప్లై తగ్గి ఈ ఆకస్మిక ధర పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. మార్కెట్‌కు వచ్చే టమోటాల పరిమాణం సాధారణ ఇన్‌ఫ్లోలో సగం కంటే తక్కువగా ఉందని..  దీని వల్ల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

వర్షాలు కొనసాగి సప్లై సమస్యలు పరిష్కారం కాకపోతే..  రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు ఇప్పటికే గృహ బడ్జెట్‌లను దెబ్బతీస్తున్నాయి. అనేక కుటుంబాలు రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా పేద, మిడిల్ క్లాస్ వర్గాలు.. పెరుగుతున్న కూరగాయల ధరలతో మరింత వర్రీ అవుతున్నారు. 

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు టమోటా సరఫరాలో జాప్యం కూడా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని టమోటాలు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కిలోకు రూ.50–60 వరకు అమ్ముడవుతుండగా.. ఇతర జిల్లాల్లో ధర రూ.35 నుంచి 45 మధ్య ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?