Hyderabad: వాహనదారులకు మరో బంపర్ ఆఫర్..! ఈ గడువులోగా చెల్లిస్తే భారీ డిస్కౌంట్..

|

May 19, 2022 | 6:01 PM

నెల రోజుల్లోపు క్లియర్‌ చేసుకుంటే వాహనదారులకు 20శాతం వరకు రాయితీ ఇచ్చే యోచనలో నగర ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారు. ప్రతిపాదనల దశలో ఉన్నప్పటికీ ఈ స్కీమ్‌ను ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోకి తీసుకొచ్చేందుకు..

Hyderabad: వాహనదారులకు మరో బంపర్ ఆఫర్..! ఈ గడువులోగా చెల్లిస్తే భారీ డిస్కౌంట్..
Hyderabad Traffic Police
Follow us on

మరో బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు(hyderabad traffic police). ట్రాఫిక్‌ చలాన్‌ విధించిన నెల రోజుల్లోపు క్లియర్‌ చేసుకుంటే వాహనదారులకు 20శాతం వరకు రాయితీ ఇచ్చే యోచనలో నగర ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారు. ప్రతిపాదనల దశలో ఉన్నప్పటికీ ఈ స్కీమ్‌ను ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ విధానంతో వాహనాదారులలో ట్రాఫిక్‌ నిబంధనలపై మరింత అవగాహన తేవడంతోపాటు మరోసారి చలాన్‌ పడకుండా వాహనదారుడిని జాగ్రత్తపడేలా చేయవచ్చని పోలీసులు అనుకుంటున్నారు. ఒకసారి వాహనదారుడు చలాన్‌ పడిన వెంటనే జరిమాన చెల్లిస్తే.. మరోసారి ట్రాఫిక్‌ ఉల్లంఘన చేయవద్దనే భావన కలుగుతుందని పోలీసులు అంటున్నారు. ఒకటే కదా.. చూద్దామని వేచి చూసే వాళ్లు పదుల సంఖ్యలో జరిమానాలు విధించినా పట్టించుకోరు. మరోరోజు చెల్లిద్దాం అనుకుంటూ వాయిదా వేస్తూనే ఉంటారు. చలాన్లు పెరుగుతున్నా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలనే ఆలోచన చేయరు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ఈ కొత్త స్కీమ్‌ ఉపయోగపడుతుందని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు.

మల్టీ సౌండ్ హారన్ లు ఉపయోగించే వారిపై..

ఇవి కూడా చదవండి

మల్టీ సౌండ్ హారన్ లు ఉపయోగించే వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో వాహనాల ద్వని కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. గాలి కాలుష్యంతో పాటుగా శబ్ద కాలుష్యం విపరీతంగా పెరగడంతో దీనిని నియంత్రించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు లేటెస్ట్ బైక్స్ పెరిగిపోతున్నాయి. ఇక వాటికి చాలామంది మల్టీ సౌండ్ హారన్ లు ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యాన్ని మరింత పెంచుతున్నారు.