Hyderabad: బంగ్లాదేశ్ టూ హైదరాబాద్.. వయా పశ్చిమబెంగాల్.. భాగ్యనగరంలో హై అలర్ట్

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దఎత్తున పెద్ద ఎత్తున వలసబాట పట్టారు. సరిహద్దుల్లో ఉన్న భారత్‌వైపే ఎక్కువ మంది చూస్తున్నారు. అక్రమంగా హైదరాబాద్ కూడా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహడీషరీఫ్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో బుధవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

Hyderabad: బంగ్లాదేశ్ టూ హైదరాబాద్.. వయా పశ్చిమబెంగాల్.. భాగ్యనగరంలో హై అలర్ట్
Hyderabad
Follow us

|

Updated on: Aug 08, 2024 | 1:21 PM

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దఎత్తున పెద్ద ఎత్తున వలసబాట పట్టారు. సరిహద్దుల్లో ఉన్న భారత్‌వైపే ఎక్కువ మంది చూస్తున్నారు. అక్రమంగా హైదరాబాద్ కూడా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహడీషరీఫ్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో బుధవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ అధిక సంఖ్యలో నగరానికి అక్రమంగా వలసవచ్చారు. చిరువ్యాపారులు, పరిశ్రమలు, భవన నిర్మాణరంగంలో కార్మికులుగా పనిచేస్తూ స్థానికంగా స్థిరపడ్డారు. పలువురు వీలుచిక్కినప్పుడల్లా అక్రమంగా బంగ్లాకు వెళ్లి వస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల వారి రాకపోకలు ఎక్కువ కాగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాలకు చాలాకాలంగా బంగ్లాదేశ్‌ నుంచి పలువురు అక్రమంగా వస్తున్నారు. రెండు నెలల క్రితం కోల్‌కతా నుంచి ఖమ్మం చేరిన బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు మైనర్లను.. ఆపరేషన్‌ ముస్కాన్‌’లో భాగంగా పట్టుకున్నారు. వారంతా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ పిల్లల్ని సొంత దేశానికి పంపారు. ఇక ఇటీవలే సికింద్రాబాద్‌లో ఓ మైనర్‌ సహా ఐదుగురు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు ఎందుకొచ్చారని ప్రశ్నించగా.. చాంద్రాయణగుట్టలో ఉన్న తమ బంధువులు రప్పించినట్లు చెప్పారు. వీరిని అరెస్ట్‌ చేసినట్టు తెలియగానే వారిని రప్పించిన బంధువులు అజ్ఞాతంలోకి వెళ్లారు.

బంగ్లాదేశ్ టూ హైదరాబాద్.. వయా పశ్చిమబెంగాల్..

బంగ్లాదేశ్ టూ హైదరాబాద్.. వయా పశ్చిమబెంగాల్ ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే అక్రమంగా చేరిన బంగ్లాదేశీయుల్లో కొందరు దళారులుగా మరింత మందిని నగరానికి రప్పిస్తున్నట్టు గుర్తించారు. అక్రమంగా సరిహద్దు దాటించి రైళ్లలోకి చేర్చేంతవరకూ బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌లోని ఏజెంట్లు ఈ దళారులకు సహకరిస్తారు. దీనికి ప్రతిఫలంగా ఒక్కొక్కరికీ 5 నుంచి 6 వేల చొప్పున వసూలు చేస్తారు. బంగ్లాదేశ్‌ నుంచి మాల్డా ద్వారా సరిహద్దు దాటి కోల్‌కతా చేరవేస్తారు. అక్కడ నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను తయారుచేసి వీరికిస్తారు. పోలీసులకు చిక్కబోమనే ధీమా వచ్చాక కోల్‌కతా నుంచి రైలుమార్గంలో తెలంగాణకు తరలిస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన నిందితుల పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇలా గత రెండేళ్లలో 1000 మందికి పైగా బంగ్లా నుంచి అక్రమంగా వచ్చి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా ఎక్కడున్నారు? వారిని తీసుకొచ్చిన దళారులు ఎవరో తెలుసుకునే పనిలో పోలీసులున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..