AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains Video: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం… వాహనాలపై కూలిన భారీ వృక్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వాన కురిసింది. ఒక్క గంటలోనే 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బంజారాహిల్స్ రోడ్‌ నెం.1లో వాహనాలపై భారీ చెట్టు కూలిపోయింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో రాకపోకలకు...

Rains Video: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం... వాహనాలపై కూలిన భారీ వృక్షం
Tree Falls On Vehicles In H
K Sammaiah
|

Updated on: Aug 04, 2025 | 5:55 PM

Share

హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వాన కురిసింది. ఒక్క గంటలోనే 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బంజారాహిల్స్ రోడ్‌ నెం.1లో వాహనాలపై భారీ చెట్టు కూలిపోయింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్‌, రామంతపూర్‌, నాచారం, తార్నాక, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం దంచికొట్టింది. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీచాయి. అప్రమత్తమైన హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.

వీడియో చూడండి:

షేక్‌పేట్‌లో అత్యధికంగా 7.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 5.3, ఖైరతాబాద్‌లో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట-మాసాబ్‌ట్యాంక్ రోడ్డులో ట్రాఫిక్ ట్రామ్ ఏర్పడింది. రాజ్‌భవన్ సమీపంలో రోడ్లపై మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. మరింత భారీ వర్షసూచన ఉండటంతో ఉద్యోగులకు సేఫ్టీ గైడ్‌లైన్స్ జారీచేసింది పోలీసు శాఖ. దశలవారీగా ఇళ్లకు బయల్దేరారని సూచించింది.

రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు