Good News: కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్లు త్వరలో ప్రారంభం.. కీలక ప్రకటన చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి..

|

Feb 08, 2022 | 8:58 PM

కొల్లూరులో నిర్మించిన రెండు పడకల గదుల భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం కొల్లూరు ఫేస్ 2లో..

Good News: కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్లు త్వరలో ప్రారంభం.. కీలక ప్రకటన చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి..
Mayor Gadwal Vijayalakshmi Min
Follow us on

Kollur Housing Project: కొల్లూరులో నిర్మించిన రెండు పడకల గదుల భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం కొల్లూరు ఫేస్ 2లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ​.. ప్రభుత్వ పరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టడం జరిగిందని​,​ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆత్మగౌరవంతో బతకాల​నే​ సంకల్పంతో వారికి సొంతింటి కళ నెరవేరే విధంగా నయా పైసా లేకుండా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు​.​ ​నగరంలో నిరుపేదలకు పంపిణీ చేయడం ​జరుగుతుందన్నారు.​​​ ​ ​కొల్లూరు ప్రాంతం దూరంగా ఉందనే అపోహలు పడవద్దని కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో ఈ ప్రాంతంలో సుమారు 20 వేల పైగా నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు​.

కొల్లూరులో 117 బ్లాక్ లలో 15​,​600 రెండు పడకల గదుల నిర్మాణం సకల సౌకర్యాలతో నిర్మించడం జరిగిందని ఒక్కొక్క బ్లాక్ వివిధ డిజైన్ల​తో​ నిర్మించడం జరిగిందని త్రాగునీరు వసతి అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా లిఫ్టులు అన్ని వసతు​​లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.​

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంగన్వాడి కేంద్రం​,​ ఆరోగ్య కేంద్రం​, ​​బస్టాండ్ ఇతర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు లేకుండా షటర్ లను కూడా ఏర్పాటు చేసినట్లు మేయర్ వివరించారు​.

కొల్లూరు ఫేస్ 2 లో 15​,​600 తో పాటు ఫేస్ 1 లో 2052 ఇళ్లు, ఈదుల నాగులపల్లి లో 1944 ఇళ్లు పూర్తయ్యాయని..​ ఇళ్ల కేటాయింపులు పారదర్శకంగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామన్నారు​.​ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ​కేటిఆర్ ఆదేశాల మేరకు పరిశీలించినట్లు మేయర్ చెప్పారు​.

డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ​.. నియోజవర్గాల​లో​ ​ఉ​న్న అర్హులైన బీదవారికి ఇళ్లను కేటాయిస్తామని నయాపైసా లేకుండా ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు​ జీహెచ్ఎంసీ మేయర్.​ ప్రైవేట్​ సంస్థలు నిర్మించిన గృహాల కంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయని త్వరలో ఈ ప్రాంతంలో నిర్మించిన గృహాలను అందుబాటులోనికి తీసుకురాన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ​ఓ.ఎస్.డి సురేష్​,​ డిప్యూటీ ఈ ఈ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు​.

ఇవి కూడా చదవండి: Ministry of Defence Recruitment 2022: ఇంటర్‌ పాస్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగ అవకాశాలు.. ఇలా అప్లై చేయండి..

TS RTC: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టీవీ9తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పెషల్ ఇంటర్వ్యూ..