GHMC Koushik Reddy: కౌషిక్‌ రెడ్డికి జీహెచ్‌ఎంసీ అధికారుల షాక్‌.. నిబంధనలు ఉల్లంఘించారంటూ భారీ జరిమాన..

|

Jul 21, 2021 | 10:29 PM

GHMC Fine Koushik Reddy: కాంగ్రెస్‌ మాజీ నేత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన కౌశిక్‌ రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌..

GHMC Koushik Reddy: కౌషిక్‌ రెడ్డికి జీహెచ్‌ఎంసీ అధికారుల షాక్‌.. నిబంధనలు ఉల్లంఘించారంటూ భారీ జరిమాన..
Koushik Reddy
Follow us on

GHMC Fine Koushik Reddy: కాంగ్రెస్‌ మాజీ నేత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన కౌశిక్‌ రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌.. బుధవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో తన అనుచరులతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఆయన నిబంధనలు ఉల్లంఘించారంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతోన్న సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి.

దీంతో వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీలపై ట్విట్టర్‌ వేదికగా జీహచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. మొత్తంగా 10 ఫిర్యాదులు అందాయి. వీటిని చూసిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కౌశిక్‌ రెడ్డికి మొత్తం రూ. 5,60,000 జరిమానా విధిస్తూ చాలాన్‌ జారీ చేశారు. ఎల్‌వీ ప్రసాద్‌ మార్గంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌ ఏకంగా రూ. లక్ష జరిమాన విధించడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఫ్లెక్సీల వ్యవహారంపై టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి స్పందించారు. నగరంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని రవి ఆరోపించారు. నిబంధనలను కేవలం ప్రతిపక్షాలకే వర్తిసాయా అని ఆయన ప్రశ్నించారు. ఇక రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు.

Also Read: Tokyo Olympics 2021: దారులన్నీ అటువైపే.. కసితో పడుతున్న అడుగులు.. పతకాల కోసం పరుగులు..

Walking: వ్యాయామం కంటే చురుకైన నడక వృద్ధులలో జ్ఞాపకశక్తిని పెంచుతుంది..తాజా పరిశోధనల్లో వెల్లడి 

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా