EFLU Hyderabad Jobs 2023: హైదరాబాద్-ఇఫ్లూలో భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2,09,200 జీతం
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న .. 97 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత..
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న .. 97 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. వయోపరిమితి, నియామక విధానం, అనుభవం వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.