Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి.. తొలిసారి ప్రతిపక్షనేత హోదాలో సభకు కేసీఆర్‌

|

Updated on: Jul 25, 2024 | 3:13 PM

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది రేవంత్‌ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్‌ సమావేశమై.. తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది.

Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి.. తొలిసారి ప్రతిపక్షనేత హోదాలో సభకు కేసీఆర్‌
Telangana Assembly

LIVE NEWS & UPDATES

  • 25 Jul 2024 01:55 PM (IST)

    తెలంగాణ బడ్జెట్

    ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌కు 29 వేల కోట్లు కేటాయింపు. మహిళా సంఘాల్లో ఉన్న 63 లక్షల మంది మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని రూపొందించాం. మహిళా సంఘాలకు లక్ష కోట్ల ఆర్థిక సాయం అందిస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం. ఈ పథకం ద్వారా మహిళలకు 2351 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.

  • 25 Jul 2024 01:30 PM (IST)

    నీటి పారుదల శాఖకి ఈ బడ్జెట్ లో 22,301 కోట్లు

    -) గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణలలో ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీనివల్ల, ఎంతో ప్రజాధనం ఖర్చు అయ్యి కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో, మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం.

    -) రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ, మధ్యతరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్లలో జరగకపోవడం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్ధ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరుగలేదు. అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మత్తులను తగిన సమయంలో చేపట్టడానికి నిశ్చయించాము.

    నీటి పారుదల శాఖకి ఈ బడ్జెట్ లో 22,301 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

  • 25 Jul 2024 01:10 PM (IST)

    నీటి పారుదల రంగం..

    –) రాష్ట్రంలో ఈనాటి వరకు 34 భారీ, 39 మధ్యతరహా మొత్తం 73 నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. వాటిలో 42 ప్రాజెక్టులను (10 భారీ మరియు 32 మధ్యతరహా) పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం 24 భారీ మరియు 7 మధ్యతరహా మొత్తం 31 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

    –) గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లలో లోపాలు, నాణ్యతా రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసాయి. ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్బాట ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొద్దికాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్ర్భాంతికి గురయ్యింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని నియమించాము. ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చుపెట్టిన వేల కోట్ల ప్రజా ధనం వృధా అవ్వకుండా ప్రాజెక్టును కాపాడడానికి National Dam Safety Authority వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాము.

  • 25 Jul 2024 12:55 PM (IST)

    తెలంగాణ ఆర్థిక ‘భట్టీ’యం :

    • ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం. • Everything can wait, but not agriculture.. తొలి ప్రధాని నెహ్రూ మాటల్ని బలంగా విశ్వసిస్తున్నాం. • రుణమాఫీ హామికి “It always since impossible until it done” అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు అక్షరాల వర్తిస్తాయి. • కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని రుణమాఫీతో రుజువైంది. • ప్రధాని ఫసల్ బీమా యోజన’ పథకంలో ఈ ఏడాది నుంచే చేరుతాం. ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. • గత ప్రభుత్వం కుట్రపూరితంగా ‘ధరణి’ని చేసింది. • లోపభూయిష్టమైన ధరణి వల్ల చాలా మందికి రైతుబంధు, రైతుబీమాలను కూడా చాలామంది రైతులు అందుకోలేకపోయారు. • ధరణి పోర్టల్ వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేసాం. • కమిటీ అధ్యయనం పూర్తయ్యాక సరైన నిర్ణయం తీసుకుంటాం. • 72,659 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇదొక మైలురాయి.

  • 25 Jul 2024 12:54 PM (IST)

    తెలంగాణ అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ హాజరు

    — బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా విపక్ష నేతగా తొలిసారి సభకు వచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి విపక్షానికి పరిమితమైంది. దీంతో కేసీఆర్ ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చుకున్నారు.

    — హైదరాబాద్ నందినగర్‌ నుంచి అసెంబ్లీకి బయలుదేరుతుండగా కేసీఆర్‌ వాహనానికి దిష్టితీశారు. తన నివాసం దగ్గర నుంచి బయలుదేరుతుండగా అభిమానులు గుమ్మడికాయ కొట్టారు.

  • 25 Jul 2024 12:33 PM (IST)

    తెలంగాణ బడ్జెట్..

    తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,159కోట్లు.

    తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..

    ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..

    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..

    వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..

    వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659

    హార్టికల్చర్-737

    పశుసంవర్ధక శాఖ-19080

    మహాలక్ష్మి ఉచిర రవాణా-723

    గృహజ్యోతి-2418

    ప్రజాపంపిణీ వ్యవస్థ-3836

    పంచాయతీ రాజ్-29816

    మహిళా శక్తి క్యాంటిన్ -50

    హైదరాబాద్ అభివృద్ధి-10,000

    జీహెఎంసీ-3000

    హెచ్ ఎండీఏ-500

    మెట్రో వాటర్-3385

    హైడ్రా-200

    ఏయిర్పోట్ కు మెట్రో-100

    ఓఆర్ ఆర్ -200

    హైదరాబాద్ మెట్రో-500

    ఓల్డ్ సిటీ మెట్రో-500

    మూసీ అభివృద్ధి-1500

    రీజినల్ రింగ్ రోడ్డు-1500

    స్ర్తీ ,శాశు -2736

    ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17000

    మైనారిటీ సంక్షేమం-3000

    బీసీ సంక్షేమం-9200

    వైద్య ఆరోగ్యం-11468

    విద్యుత్-16410

    అడవులు ,పర్యావరణం-1064

    ఐటి-774

    నీటి పారుదల -22301

    విద్య-21292

    హోంశాఖ-9564

    ఆర్ అండ్ బి-5790

  • 25 Jul 2024 12:08 PM (IST)

    తెలంగాణ పద్దు

    తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికే అధిక నిధులు కేటాయింపు ఉన్నట్టు తెలుస్తోంది.

  • 25 Jul 2024 11:59 AM (IST)

    బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్‌

    — బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్‌ — మ.12గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి — శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న శ్రీధర్‌బాబు — ఈసారి రూ.2.97 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉండే అవకాశం — అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ తయారీ — 6 గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం — బడ్జెట్‌ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్

  • 25 Jul 2024 11:58 AM (IST)

    తొలిసారి ప్రతిపక్షనేత హోదాలో సభకు కేసీఆర్

    — అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ — బడ్జెట్‌ సందర్భంగా సభకు హాజరు — తొలిసారి ప్రతిపక్షనేత హోదాలో సభకు కేసీఆర్ — అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే.. — కాళేశ్వరం బయల్దేరనున్న BRS ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు — అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లనున్న బృందం — ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ను సందర్శించనున్న నేతలు — రేపు కన్నెపల్లి పంప్‌హౌస్‌, మేడిగడ్డ సందర్శన

  • 25 Jul 2024 11:58 AM (IST)

    కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్

    — కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ — శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి — శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న శ్రీధర్‌బాబు — రూ.2.97 లక్షల కోట్లతో బడ్జెట్‌ ఉండే అవకాశం — అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ తయారీ — 6 గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం — బడ్జెట్‌ సందర్భంగా అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది రేవంత్‌ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్‌ సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్‌ సమావేశమై.. తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత.. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్ధికమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనునుండగా.. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభకు ఒకరోజు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. అటు.. 28న ఆదివారం, 29న హైదరాబాద్‌లో బోనాల పండుగ నేపథ్యంలో వరుసగా రెండు రోజులు సెలవు ఉంటుంది. మంగళవారం తర్వాత ఈ నెల 30, 31 తేదీల్లో పద్దులపై చర్చించి.. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అయితే.. ఎన్నికల్లో భారీ ఎత్తున పథకాలు, అభివృద్ధి పనులకు కాంగ్రెస్‌ హామీలు ఇచ్చింది. అయితే.. ఓ వైపు కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్న రేవంత్‌ సర్కార్‌.. తెలంగాణలోని స్కీమ్స్‌కు రాష్ట్ర బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయింస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.

ఇదిలావుంటే.. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో కాంగ్రెస్‌ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సైతం.. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని పదేపదే సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానుండడంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి నెలకొంది. నిబంధనలు ఫాలో అవుతూ.. కాంగ్రెస్‌ విమర్శలకు కేసీఆర్‌ చెక్‌ పెట్టబోతున్నారా?.. అసలు.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నారు?.. అనే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తంగా.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓటాన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకురానుంది. ఎన్నికల్లో పెద్దయెత్తున హామీలు ఇచ్చిన నేపథ్యంలో బడ్జెట్‌పై అంచనాలు భారీ ఉన్నాయి. అదేసమయంలో కేసీఆర్‌ సభకు హాజరుకానుండడంతో ఈ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published On - Jul 25,2024 11:53 AM

Follow us
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!