కరోనా ఎఫెక్ట్ ఈ ఏడాది గణేష్ ఉత్సవాలపై కూడా పడింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను జారీ చేశాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రముఖ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఉండదని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. అలాగే విగ్రహంఎత్తును 21 అడుగుల నుంచి ఆరు అడుగులకు తగ్గిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక భక్తులకు దర్శనాలను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే గణేషుడికి పూజలు నిర్వహించాలని.. గణేశ్ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉత్సవ సమితి స్పష్టం చేసింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పూర్తిగా మట్టితో 27 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించిన విషయం తెలిసింఏ.