Bowenpally Kidnap Case: అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చిన పోలీసులు.. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

|

Jan 14, 2021 | 3:09 PM

Bowenpally Kidnap Case: హైదరాబాద్‌ బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ కస్టడి ముగిసింది. ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో ...

Bowenpally Kidnap Case: అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చిన పోలీసులు.. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌
Follow us on

Bowenpally Kidnap Case: హైదరాబాద్‌ బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ పోలీసు కస్టడి ముగిసింది. ఏ1గా ఉన్న  అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో కరోనా, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కోర్టుకు సెలవు ఉండటంతో ఆమెను సికింద్రాబాద్‌లోని న్యాయమూర్తి నివాసంలో హాజరు పర్చారు. మూడు రోజుల పాటు అఖిలప్రియను బేగంపేట మహిళ పోలీసుస్టేషన్‌లో విచారించారు. విచారించిన స్టెట్‌మెంట్‌ను న్యాయమూర్తికి అందజేశారు పోలీసులు. అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. అనంతరం ఆమెను చంచల్‌గూడ మహిళ జైలుకు తరలించారు. కాగా, అఖిలప్రియకు బెయిల్‌ ఇవ్వాలని ఆమె తరపున న్యాయవాదులు కోరారు. అయితే ఈ బెయిల్‌ పిటిషన్‌పై శనివారం విచారణ జరపనుంది కోర్టు.

కాగా, ఇప్పటికే అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు .. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్‌, చంద్రహాస్‌ గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. టెక్నికల్‌ సాక్ష్యలను అఖిలప్రియ ముందు ఉంచడంతో పలు ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది.

Group Clashes : హైదరాబాద్ మంగళ్ హాట్ లో 17ఏళ్ల యువకుడు అజ్జు దారుణ హత్య, స్నేహితుల మధ్య తగాదాలే కారణం.!