Telangana: ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు.. ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఫైర్

|

Jun 11, 2022 | 9:24 AM

తెలంగాణలో(Telangana) ఆర్టీసీ బస్సు పెంచడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రజలపై భారం వేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత...

Telangana: ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు.. ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay
Follow us on

తెలంగాణలో(Telangana) ఆర్టీసీ బస్సు పెంచడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రజలపై భారం వేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ఐదుసార్లు ఆర్టీసీ చార్జీలు(RTC Charges) పెరిగాయన్న సంజయ్.. ఛార్జీల పెంపుతో పేదలపై కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. ఛార్జీలు పెంచడం ద్వారా ఆర్టీసీని ప్రజలకు దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి శక్తులతో కలిసి ప్రజాధనాన్ని అధికార టీఆర్ఎస్ లూటీ చేస్తోందని బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనపై, 8 ఏళ్ల కేసీఆర్‌ పాలనపై చర్చకు సిద్ధమేనా అని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. కేంద్ర పథకాలు రాష్ట్రానికి అందాలంటే, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఇప్పటికే ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) మరో షాక్ ఇచ్చింది. రెండురోజుల క్రితమే డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలు భారీగా పెంచిన ఆర్టీసీ తాజాగా రూట్‌ బస్‌పాస్‌ ఛార్జీలనూ(Bus Pass Charges) పెంచేసింది. 4కిలో మీటర్ల దూరానికి గతంలో రూ.165 ఉన్న బస్ పాస్ ఛార్జీని రూ.450కు, 8 కిలోమీటర్ల దూరానికి రూ.200 ఉన్న ఛార్జీని రూ.600కు, 12 కిలోమీటర్ల దూరానికి రూ.245 నుంచి రూ.900లకు, 18కిలోమీటర్లు దూరానికి రూ.280 నుంచి రూ.1,150కు, 22 కిలోమీటర్ల దూరానికి రూ.330 నుంచి రూ.1350కు పెంచింది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు పట్టణాలకు వస్తుంటారు. సాధారణంగా వీరు నెలవారీ బస్ పాస్ తీసుకుని ప్రయాణాలు చేస్తారు. ఈ క్రమంలో తాజాగా పెంచిన ఛార్జీలు వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి