AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన ఆటో డ్రైవర్.. చివరికి, పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్‌ పోసుకుని..

ఆటో డ్రైవర్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కాడు.. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు.. కేసు నమోదు చేశామని.. తర్వాత కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా జరిమానా కూడా ఉంటుందని తెలిపారు. అయితే.. పోలీసులకు పట్టుబడటంతో ఆటోడ్రైవర్ మనస్తాపం చెందాడు..

Hyderabad: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన ఆటో డ్రైవర్.. చివరికి, పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్‌ పోసుకుని..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Nov 05, 2025 | 11:21 AM

Share

ఆటో డ్రైవర్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కాడు.. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు.. కేసు నమోదు చేశామని.. తర్వాత కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా జరిమానా కూడా ఉంటుందని తెలిపారు. అయితే.. పోలీసులకు పట్టుబడటంతో ఆటోడ్రైవర్ మనస్తాపం చెందాడు.. చివరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట.. మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగిరెడ్డి మీన్‌రెడ్డి అనే ఆటో డ్రైవర్‌ మంగళవారం సాయంత్రం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో రీడింగ్‌ 120 వచ్చింది.. దీంతో మీన్ రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో మనస్తాపం చెందిన మీన్ రెడ్డి అర్ధరాత్రి కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం మంటలు ఆర్పి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మీన్ రెడ్డి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

మీన్‌రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే మీన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!