AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cream Party: హైదరాబాద్‌లో అతిపెద్ద ఐస్‌క్రీమ్ పార్టీ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్

Ice Cream Party: రియల్ మిల్క్, క్రీమ్‌తో తయారైన అరుణ్ ఐస్‌క్రీమ్స్ బ్లాక్‌కరెంట్, స్ట్రాబెర్రీ బార్లు, కారామెల్ సాండ్‌విచ్, చాక్లెట్ కోన్స్‌ను ఆస్వాదించారు. పాల్గొన్న పిల్లలు నిరంతరం 30 నిమిషాల పాటు ఐస్‌క్రీమ్ తింటూ ఈ రికార్డును సాధించారు. అలాగే ఐస్..

Ice Cream Party: హైదరాబాద్‌లో అతిపెద్ద ఐస్‌క్రీమ్ పార్టీ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్
Arun Ice Creams
Subhash Goud
|

Updated on: Feb 06, 2026 | 6:29 PM

Share

Ice Cream Party: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, విశ్వసనీయమైన గుర్తింపుగా ఉన్న ఐస్‌క్రీమ్ బ్రాండ్ అయిన అరుణ్ ఐస్‌క్రీమ్స్. హైదరాబాద్‌లో 5,113 మంది పిల్లలను ఒకే వేదికపై సమీకరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ సోషల్ పార్టీ నిర్వహించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

ఈ ప్రత్యేకమైన, ఆనందోత్సాహభరితమైన కార్యక్రమంలో భాగంగా పిల్లలు రియల్ మిల్క్, క్రీమ్‌తో తయారైన అరుణ్ ఐస్‌క్రీమ్స్ బ్లాక్‌కరెంట్, స్ట్రాబెర్రీ బార్లు, కారామెల్ సాండ్‌విచ్, చాక్లెట్ కోన్స్‌ను ఆస్వాదించారు. పాల్గొన్న పిల్లలు నిరంతరం 30 నిమిషాల పాటు ఐస్‌క్రీమ్ తింటూ ఈ రికార్డును సాధించారు.

Arun Ice Creams1

Arun Ice Creams

ఈ సందర్భంగా హాట్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.జి. చంద్ర మోగన్ మాట్లాడుతూ.. “5,000 మందికి పైగా పిల్లలు కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించడం నిజంగా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే క్షణం. మా ప్రయాణం ఎప్పుడూ నాణ్యతపై ఉన్న నిబద్ధతతో పాటు, ఐస్‌క్రీమ్ అందించే సాదా ఆనందాన్ని ప్రతి ఒక్కరికీ పంచడమే లక్ష్యంగా సాగుతోంది” అని తెలిపారు.

2019లో కూడా రికార్డ్‌..

ఇదిలా ఉండగా, ఇంతకు ముందు ఈ రికార్డ్‌ను 2019 జనవరి 30న ఇటలీలోని సలెర్నో నగరంలో యూనిలీవర్ ఇటలీ సంస్థ 962 మంది పాల్గొనగా నెలకొల్పింది. ఆ రికార్డును అధిగమించడం ద్వారా అరుణ్ ఐస్‌క్రీమ్స్ అంతర్జాతీయ స్థాయిలో కీలక మైలురాయిని సాధించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి