AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హ్యాపీ హోలీ అంటూ యాసిడ్‌తో దాడి..

హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలికి వచ్చి 'హ్యాపీ హోలీ' అంటూ అకౌంటెంట్‌ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హ్యాపీ హోలీ అంటూ యాసిడ్‌తో దాడి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Mar 15, 2025 | 1:08 PM

Share

హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలికి వచ్చి ‘హ్యాపీ హోలీ’ అంటూ అకౌంటెంట్‌ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నర్సింగరావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సాయంత్రం సమయంలో ఆలయం లోపలికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి హ్యాపీ హోలీ అంటూ అకౌంటెంట్ నర్సింగ్ రావుపై యాసిడ్ పోశాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘటనతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.. తీవ్ర గాయాలతో అకౌంటెంట్ విలవిలాడిపోయారు..

కాగా.. సైదాబాద్‌ ఆలయంలో యాసిడ్‌ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు.

వీడియో చూడండి..

నిందితుడు క్యాప్, మాస్క్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చూస్తే.. ఇది ముందుగా ప్లాన్ చేసిన దాడిగా అనిపిస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇక.. యాసిడ్‌ ఘటనను ఆలయ ఛైర్మన్‌ శ్రీధర్‌ ఖండించారు. అన్నదానానికి సంబంధించిన వివరాలు అడుగుతూ అకౌంటెంట్‌ నర్సింగ్‌రావుపై సడెన్‌గా దాడి చేసినట్లు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ