Hyderabad News: ఇది ఇల్లా.. నందనవనమా..? చూసి తీరాల్సిన అద్భుతమైన నిలయం..!

|

Feb 12, 2022 | 8:21 PM

Hyderabad News: ప్రస్తుత కాలంలో ఎటు చూసినా కాంక్రీట్ జంగిలే కనిపిస్తుంది. వర్షం చుక్క నీరు ఇంకిపోవడానికి కూసింత జాగ కూడా లేని పరిస్థితి భాగ్యనగరంలో నెలకొంది.

Hyderabad News: ఇది ఇల్లా.. నందనవనమా..? చూసి తీరాల్సిన అద్భుతమైన నిలయం..!
House
Follow us on

Hyderabad News: ప్రస్తుత కాలంలో ఎటు చూసినా కాంక్రీట్ జంగిలే కనిపిస్తుంది. వర్షం చుక్క నీరు ఇంకిపోవడానికి కూసింత జాగ కూడా లేని పరిస్థితి భాగ్యనగరంలో నెలకొంది. అలాంటి కాంక్రీట్‌ జంగిల్‌లో ఈ ఇళ్లు మాత్రం ఎంతగానో ఆహ్లాదాన్ని పంచుతోంది. ఎటుచూసినా ఆకుపచ్చని మొక్కలు అందర్నీ పలకరిస్తాయి. రంగు రంగుల పూల మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వానిస్తాయి. ఆ ఇంట్లో అడుగడుగునా ఆకుపచ్చని ప్రపంచం దర్శనమిస్తోంది. రంగు రంగుల మొక్కలతో ఇంటిని నందనవనంగా మార్చేశారు ఈ ఇల్లాలు. మొక్కలను పెంచడమే కాకుండా చిన్నచిన్న కుండీలకు ముగ్గులు వేసి బొమ్మరిల్లు మాదిరిగా తయారు చేసింది.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన నితా రెడ్డి అనే మహిళ ఓ ప్రైవేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వృత్తి విద్యాభోదన అయినప్పటికీ ఇంట్లో గార్డెనింగ్‌ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నితా రెడ్డికి చిన్ననాటి నుండి మొక్కలంటే ప్రాణం. తన ఇష్టాన్ని అలవాటుగా మార్చుకున్నారు. మూడేళ్ల క్రితం ఇండోర్ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. తనకున్న కొద్దిపాటి స్థలంలోనే అందమైన మొక్కలను పెంచుతున్నారు. రకరకాల పూల మొక్కలతో పాటు అన్ని రకాల మొక్కలనూ పెంచుతున్నారు.

ఇంట్లో కిటికీల వద్ద, మెట్ల పక్కన ఎక్కడ స్థలం ఉంటే.. అక్కడ ఒక మొక్కను పెట్టి సంరక్షిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఖాళీ సమయంలో ఆమె స్వయంగా మొక్కలకు నీళ్లు పట్టడం చేస్తుంటారు. దాంతో తనకు శారీరక వ్యయంతో పాటు, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని సంతోషంగా చెబుతున్నారు నితారెడ్డి. కాదేదీ మొక్కల పెంపకానికి అనర్హం అన్నట్టుగా వాడి పడేసిన ప్లాస్టిక్ డబ్బాలు, కూల్‌ డ్రింక్‌ డబ్బాలు సహా దేన్నీ బయట పడవేయకుండా వాటికి అందమైన రంగు రంగుల ముగ్గులు వేసి, అందులో మొక్కలు నాటి దానికో రూపాన్ని తీసుకొస్తున్నారు. అంతేకాదు ఈ మొక్కల నుంచి రాలిన ఆకులను సేంద్రియ ఎరువుగా తయారు చేసి, తిరిగి ఆ మొక్కలకు ఎరువుగా అందిస్తున్నారు. వీరింటికి వచ్చేవారు ఆనందంగా ఫీలవుతున్నారని, పార్కుకు వెళ్లినట్టుగా ఉందని చాలామంది సంతోష పడుతున్నారని నితారెడ్డి అంటున్నారు. ఇంటికి వచ్చిన వారికి ఆమె ఒక మొక్కను గిఫ్ట్‌గా అందిస్తూ.. అందరు పర్యావరణాన్ని పరిరక్షించేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు.

Also read:

Priyamani: నటిగా నాకింకా ఆకలి తీరలేదు!.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajasthan Royals IPL Auction 2022: రాజస్థాన్ చేరిన హార్డ్ హిట్టర్.. జాబితాలో ఇంకెవరున్నారంటే?

Viral Photo: ఈ ఫోటోలో హచ్‌ డాగ్‌ నక్కి నక్కి చూస్తోంది.. ఎక్కడుందో కనిపించిందా.?