AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కసరత్తు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ.!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికారులు సైతం అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నారు. పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సమావేశం నిర్వహించారు. షెడ్యూల్‌ ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ ఈసీ తీసుకున్న నిర్ణయమేంటి?

Hyderabad: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కసరత్తు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ.!
Hyderabad District Election Officer Karnan Meets Political Parties
Balaraju Goud
|

Updated on: Aug 27, 2025 | 10:16 PM

Share

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికారులు సైతం అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నారు. పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు ఉన్న 329 పోలింగ్‌ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అదనంగా 79 కొత్త పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. రేషనలైజేషన్‌ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు.

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 329 పోలింగ్‌ స్టేషన్లకు బూత్‌ లెవెల్‌ అధికారులు అందుబాటులో ఉన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల జాబితా సమర్పించాయి. ఇంకా ఇవ్వని పార్టీలు వెంటనే జాబితా అందజేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన 79 పోలింగ్‌ స్టేషన్లకు బూత్‌ లెవెల్‌ అధికారులను త్వరలోనే నియామకం చేయనుంది ఈసీ. ఇక.. జూబ్లీహిల్స్‌లో జనవరి 6 నుంచి ఆగస్టు 15 వరకు 19వేల 237 మంది ఓటు నమోదుకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 3వేల 767 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి.

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను చేసేందుకు నోడల్‌ అధికారులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో డిపార్ట్మెంట్‌కు ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ఉప ఎన్నిక ఏర్పాట్లను వేగవంతం చేశారు జిల్లా ఎన్నికల అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం