మనిషిలో పెరిగిపోయిన స్వార్థం ఎంతకైనా బరితెగించేలా చేస్తుంది. ఆఖరికి మృతిచెందిన వారి ఆత్మలు గోసరిల్లేలా చేస్తున్నారు. మృతదేహాలను ఖననం చేసిన తర్వాత అస్తికలు అపహరిస్తున్నారు. దొంగిలించిన ఆ ఆస్తికలను క్షుద్ర పూజలకు ఉపయోగిస్తున్నారని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా వరంగల్ శివారులో ఓ వ్యక్తి స్మశానవాటికలో అస్థికలు అపహరిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అతన్ని మందలించి వదిలేశారు. స్మశానవాటికలే టార్గెట్‌గా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి.
ఈ మధ్యకాలంలో క్షుద్రపూజల ఘటనలు తరచుగా చూస్తున్నాం. క్షుద్ర పూజలలో ఉపయోగించే మనిషి అస్తికలు, పుర్రె.. ఖననం చేసిన డెడ్ బాడీల నుంచి సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హనుమకొండ శివారు భీమారం స్మశానవాటికలో జరిగిన ఘటన స్థానికులు ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి కననం చేసిన డెడ్‌బాడీలను తవ్వి అందులో అస్థికలను పోగుచేసుకుని ప్లాస్టిక్ సంచిలో ఎత్తుకెళ్తున్నాడు. అది గమనించిన స్థానికులు అతన్ని పట్టుకున్నారు.
అయితే అమావాస్యకు ముందు ఈ విధంగా ఖననం చేసిన డెడ్‌బాడీలను అస్తికలు సేకరించి క్షుద్రపూజలకు ఉపయోగిస్తుంటారని.. తాంత్రిక శక్తులకు ఇలాంటి అస్తికలు, పుర్రె అవసరమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు పట్టుకున్న ఆ వ్యక్తిని నిలదీస్తే అతను పొంతన లేని సమాధానాలు చెప్పారు. సహజంగా మనిషి అంత్యక్రియల సమయంలో నోటిలో కొంత బంగారం పెట్టడం ఆనవాయితీ. అంత్యక్రియలు జరిగిన తర్వాత ఖననం చేసిన ప్రాంతంలో తవ్వి డెడ్ బాడీలో పెట్టిన బంగారాన్ని తీసుకుపోతుంటామని అలా వచ్చే ఆదాయంతో తన జీవనాన్ని సాగిస్తున్నామని చెప్పడం విశేషం. పట్టుబడిన ఆ అస్తికల దొంగ కాళ్ల, వేళ్ల పడడంతో అతన్ని మందలించి వదిలేశారు.
స్మశానవాటికల వద్ద తిష్టవేసిన ఇలాంటి దుర్మార్గులపై పోలీసులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆస్తికలతో క్షుద్రప్రజలు నిర్వహిస్తే వారి బంధువులు, రక్త సంబంధీకులకు ఏమైనా హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి