Telangana: కొల్లాపూర్‌ RID స్వర్ణోత్సవ సంబురాల్లో భాగమైన విజయ్ దేవరకొండ

|

Nov 28, 2024 | 5:51 PM

కొల్లాపూర్‌లో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమేళనం ఘనంగా జరుగుతోంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Telangana: కొల్లాపూర్‌ RID స్వర్ణోత్సవ సంబురాల్లో భాగమైన విజయ్ దేవరకొండ
RID Golden Jubilee Celebrations
Follow us on

RID విద్యాసంస్థ స్వర్ణోత్సవాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఆర్‌ఐడీ అలుమ్నీకి వండర్ బుక్ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. రెండో రోజు స్వర్ణోత్సవాల్లో ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ భాగమైయ్యారు. ఆర్‌ఐడీ విజన్-2050 ఏవీ లాంచ్‌ చేశారు విజయ్ దేవరకొండ. అనంతరం స్వర్ణోత్సవాల ఆడియో సీడీను జూపల్లి రామేశ్వరరావు, BITS వీసీ రాంగోపాల్‌రావు, ప్రొఫెసర్ జయరాంరెడ్డితో కలిసి విడుదల చేశారు విజయ్ దేవరకొండ,

అంతకముందు కొత్త హంగులతో పునర్‌నిర్మించిన ఆర్‌ఐడీ స్కూల్‌ను ప్రారంభించారు మంత్రి జూపల్లి, విజయ్‌ దేవరకొండ.. విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయ్‌ దేవరకొండ ప్రసంగించారు. కొల్లాపూర్ బలం చూశా.. భవిష్యత్ చూస్తున్నా అన్నారు. RID విద్యాసంస్థలో తన అమ్మ చదువుకున్నారని చెప్పారు. జూపల్లి రామేశ్వరరావు, మంత్రి జూపల్లి స్ఫూర్తిగా.. విద్యార్థులు గొప్పగా ఎదగాలని.. విద్యార్థులంతా సూపర్ సక్సెస్ కావాలని చెప్పారు విజయ్.

ప్రజా వాగ్గేయకారులు అందెశ్రీతో కూడా ప్రొగ్రామ్ జరిగింది. సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలతో రెండో రోజు స్వర్ణోత్సవాలు ముగిశాయి. రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలకు 200 మంది టీచర్లు వేలాది మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.. విద్యార్థులంతా ఒక్కచోట చేరి అలనాటి జ్ఞాపకాలు పంచుకుంటూ మురిసిపోతున్న దృశ్యాలు అందర్నీఆకట్టుకుంటున్నాయి. స్వర్ణోత్సవాలు సాకారం కావడానికి కారణమైన మై హోమ్‌ గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావును పూర్వ విద్యార్ధులంతా అభినందిస్తున్నారు. అదే సమయంలో కొల్లాపూర్‌ను కొహినూర్‌ వజ్రంలా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు పూర్వ విద్యార్థులంతా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి