అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర… మెతుకు సీమలో అకాల వర్షం.. ఆందోళనలో రైతన్నలు ..

|

May 15, 2021 | 5:25 PM

Unseasonal Rains: అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లా అతలాకుతలం అవుతోంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈదురుగాలులతో

అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర... మెతుకు సీమలో అకాల వర్షం.. ఆందోళనలో రైతన్నలు ..
Follow us on

అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లా అతలాకుతలం అవుతోంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈదురుగాలులతో వడగండ్ల వాన పడింది. ‌ పిడుగుపాటుకు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి, పుల్కల్, కంగ్టి మండలాల్లో పిడుగులు విరుచుకు పడ్డాయి. మునిపల్లి మండలం మగ్ధుంపల్లిలో తండ్రి, కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పశువులు మేపడానికి వెళ్లిన పుల్కల్ మండలం పోతారంకు చెందిన చంద్రయ్య, బోర్గికి చెందిన సురేష్ పిడుగు పాటుకు బలయ్యారు. బలమైన ఈదురు గాలులకు చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

వర్షానికి చాలా చోట్ల ధాన్యం తడిసి పోయింది. రామాయంపేట, మిరుదొడ్డి, దౌల్తాబాద్ మండలాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. చేతికి వచ్చిన పంటను అకాల వర్షం నుంచి కాపాడలేకపోయారు అన్నదాతలు.

ఈదురు గాలులకు తాడిపత్రులు ఎగిరిపోవడంతో ధాన్యం తడిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో వందల బస్తాల ధాన్యం నేలపాలైంది. రెండు రోజులుగా కొనుగోళ్లు లేకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రామాయంపేటలో ధర్నాకు దిగారు.

 

ఇవి కూడా చదవండి: అంతేగా… మేమూ తయారు చేస్తాం… ఆ స్థాయి లాబొరేటరీలు AP,తెలంగాణల్లోనూ ఉన్నాయంటున్న బయోటెక్నాలజీ నిపుణులు

Black Fungus: ఆ నీటి వాడకమే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి కారణమా.! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..