Telangana: లష్కర్‌ బోనాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

రేపటి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో రేపు సికింద్రాబాద్ మారుమోగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు.

Telangana: లష్కర్‌ బోనాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
Secunderabad
Follow us

|

Updated on: Jul 20, 2024 | 9:30 PM

రేపటి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో రేపు సికింద్రాబాద్ మారుమోగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. రేపు తెల్లవారుజామున వేద మంత్రోచ్చారణలతో ఆలయ ద్వారం తెరవనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం బోనాలు సమర్పించేందుకు భక్తులకు అనుమతించనున్నారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. సాయంత్రం ఫలహారం బండ్ల ఊరేగింపు జరగనుంది. దీని కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండనుండటంతో.. పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల సమర్పణ నుంచి పలహారం బండ్ల ఊరేగింపు, మరుసటి రోజు జరిగే రంగం – భవిష్యవాణి కార్యక్రమాల వరకు అన్నీ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచే కాదు విదేశాల నుంచి సైతం అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు భక్తులు. రేపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుండటంతో.. ఇవాళే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బోనాల సందర్భంగా దాదాపు 15 వందల మంది పోలీసులతో కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల సందర్భంగా 175 ప్రత్యేక బస్సులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. లష్కర్‌ బోనాల సందర్భంగా రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు అమ్మవారి ఆలయం పరిసరా ప్రాంతాల్లోని అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పలు మార్గాల్లో రెండు రోజులపాటు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ నగర కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతర ముగిసేవరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు కమిషనర్. ట్రాఫిక్‌ దృష్ట్యా రేపు రైల్వేస్టేషన్‌కు వెళ్లాలనుకునే వారు ముందుగానే ఇంట్లోంచి బయలుదేరితే మంచిదని సూచించారు.

మొత్తంగా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈసారి బోనాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు ఎప్పటికప్పుడు బోనాల ఏర్పాట్లపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించి.. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఈ పండు తాగారంటే.. షుగర్, బీపీలకు చెక్ పెట్టొచ్చు..
ఈ పండు తాగారంటే.. షుగర్, బీపీలకు చెక్ పెట్టొచ్చు..
లష్కర్‌ బోనాలకు ఏర్పాట్లు పూర్తి.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
లష్కర్‌ బోనాలకు ఏర్పాట్లు పూర్తి.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రోజు ఒక్క‌టి తింటే చాలు.. నాజుగ్గా మారిపోతారు..షుగర్ పరార్!
రోజు ఒక్క‌టి తింటే చాలు.. నాజుగ్గా మారిపోతారు..షుగర్ పరార్!
తన మాజీ భార్యకు హృతిక్ రోషన్ ఎన్ని కోట్ల భరణం ఇచ్చాడంటే..
తన మాజీ భార్యకు హృతిక్ రోషన్ ఎన్ని కోట్ల భరణం ఇచ్చాడంటే..
ఈ జ్యూస్ ఇలా చేసి వారం రోజులు తాగండి.. రిజల్ట్ మీకే కనిపిస్తుంది
ఈ జ్యూస్ ఇలా చేసి వారం రోజులు తాగండి.. రిజల్ట్ మీకే కనిపిస్తుంది
బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్‌ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్
బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్‌ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్
పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
ఎర్ర తోటకూర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..వదిలిపెట్టరు!
ఎర్ర తోటకూర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..వదిలిపెట్టరు!
కూతురు కోసం షారూక్‌ కష్టం! వావ్. ఇండస్ట్రీకి మరో హీరోయిన్ సుహానా
కూతురు కోసం షారూక్‌ కష్టం! వావ్. ఇండస్ట్రీకి మరో హీరోయిన్ సుహానా
భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు
భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు