Telangana: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిందే.. లేకుంటే రూ.1000 ఫైన్..

|

Jun 30, 2022 | 10:55 AM

బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌ స్పష్టంచేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

Telangana: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిందే.. లేకుంటే రూ.1000 ఫైన్..
Telangana Mask Rule
Follow us on

Face Mask must in Telangana: తెలంగాణలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 500లకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌ స్పష్టంచేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని.. ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు.

నిన్న 485 కరోనా కేసులు నమోదు..

రాష్ట్రంలో ప్రతీ రోజూ 500కు చేరువలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం (నిన్న) 485 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,00,476కు చేరింది. కరోనా నుంచి 236 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 7,91,944కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 4421 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 257 కేసులు నమోదు కాగా, సంగారెడ్డిలో 73, రంగారెడ్డిలో 58, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..