తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ. 2లక్షల 75వేల 891 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. మూలధన వ్యయం రూ. 29,669కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.33,786 కోట్లు ఉండగా.. రెవెన్యూఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. మూలధన వ్యయం రూ.24,178 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.2,24, 625 కోట్లుగా పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేశామన్నారు. నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. మార్పును కోరుతూ తెలంగాణ సమాజంలో స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు. సామాజిక న్యాయం చేసి చూపిస్తామన్నారు. ప్రజాల కాంక్షలను నెరవేర్చి చూపిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10లక్షలకు పెంచామన్నారు. అర్హులైన అందరికీ ఆరు గ్యారెంటీలు అందుతాయన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..