ప్రశాంతంగా బక్రీద్ పండుగ.. గోవులపై ఆయన చేసిన పనికి అందరూ షాక్..

| Edited By: Srikar T

Jun 17, 2024 | 3:33 PM

బక్రీద్ పండుగ సందర్భంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని ఒక వర్గం అరాటపడుతుంటే, గోవధ జరుపుతామని మరో వర్గం చర్యలకు పాల్పడుతుంది. ఈ ఇతరుణంలో పోలీసులు అనేక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గోవుల తరలింపుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సైతం పోలీసు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా గోవుల తరలింపు జరగకుండా అడ్డుకోవాల్సిందిగా పోలీసులకు చెప్పింది.

ప్రశాంతంగా బక్రీద్ పండుగ.. గోవులపై ఆయన చేసిన పనికి అందరూ షాక్..
Hyderabad
Follow us on

బక్రీద్ పండుగ సందర్భంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని ఒక వర్గం అరాటపడుతుంటే, గోవధ జరుపుతామని మరో వర్గం చర్యలకు పాల్పడుతుంది. ఈ ఇతరుణంలో పోలీసులు అనేక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గోవుల తరలింపుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సైతం పోలీసు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా గోవుల తరలింపు జరగకుండా అడ్డుకోవాల్సిందిగా పోలీసులకు చెప్పింది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వేసిన పిటీషన్‎పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

పోలీసులు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా.. కొన్నిచోట్ల గోవులను అక్రమంగా తరలించి గోవధ జరిపేందుకు ఒక వర్గం ప్రయత్నిస్తుండటంతో మరో వర్గానికి సంబంధించిన యువకులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలు జరిగిన ప్రతి చోట ఘర్షణలు తలెత్తాయి. మెదక్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హైదరాబాదులో కూడా చాలా ప్రాంతాల్లో గోవుల తరలింపును ఒక వర్గం యువకులు అడ్డుకొని ఆందోళన చేశారు. గోవులను తరలిస్తున్న వ్యక్తులపై పోలీసులు కేసులు పెట్టడం లేదంటూ విశ్వహిందూపరిషత్‎తో పాటు బజరంగ్‎దళ్ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.

అయితే నగరానికి సంబంధించి ఇలాంటి గొడవలు చోటు చేసుకోకుండా గో భక్త ఉత్సవ సేవా సమితి అధ్యక్షుడు గణేష్ యాదవ్ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇరువర్గాలు గొడవ పడకుండా చూసే ప్రయత్నంలో భాగంగా ఆయన పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించారు. గో వధ కోసం జరుగుతున్న అమ్మకాలను గమనించి తానే గోవులను కొనే ప్రయత్నం చేశారు. పాతబస్తీలో ఉన్న గోవులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయిన తెలిపారు. పాతబస్తిలో ఉన్న 15 ఎద్దులు, రెండు ఆవులను గణేష్ యాదవ్ కొనుగోలు చేశారు. ఒక్కొక్క ఆవును రూ.35 వేలకు కొనుగోలు చేశారు.

గణేష్ యాదవ్ చేసిన పనిని హిందూ సంఘం నేతలు అభినందిస్తున్నారు. బక్రీద్ రోజు గోవుల విక్రయాలు జరగకుండా.. గోవులను విక్రయిస్తున్న వారి నుండే వాటిని కొనుక్కొని తమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయాలని అయిన పిలుపునిచ్చారు. ఇలా చేస్తే గోవధ జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంది అని ఆయన తెలిపారు. ఇప్పటివరకు గోవుల తరలింపుకు సంబంధించి పోలీసులు 100కు పైగా కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 చెక్ పోస్ట్‎లు పెట్టి గోవుల తరలింపును అడ్డుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.