ఆ లింకులు క్లిక్ చేస్తే ఖతమే..! రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు

ఆరు గ్యారంటీల్లో కీలకమైన రుణమాఫీ హామీని నెరవేర్చింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఫస్ట్‌ఫేజ్‌లో లక్ష లోపు రుణాలను మాఫీ చేశారు.

ఆ లింకులు క్లిక్ చేస్తే ఖతమే..! రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు
Cyber Crime Alert
Follow us

|

Updated on: Jul 19, 2024 | 8:02 AM

ఆరు గ్యారంటీల్లో కీలకమైన రుణమాఫీ హామీని నెరవేర్చింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఫస్ట్‌ఫేజ్‌లో లక్ష లోపు రుణాలను మాఫీ చేశారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 11,50,193 బ్యాంకు ఖాతాల్లో 10,83,004 కుటుంబాల లబ్ధిదారులకు 6098.93 కోట్ల రూపాయలు జమ చేయడంతో ఎక్కడ చూసిన రైతుల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. రైతులు సంతోషంలో మునిగిపోయారు.

అయితే ఈ క్రమంలో రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సైబర్ నేరగాళ్లు అన్నదాతలను టార్గెట్ చేసే అవకాశముందంటున్నారు. సైబర్ ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. వారికి పలు కీలక సూచనలు చేశారు. బ్యాంకుల పేరిట మోసాలకు సైబర్ కేటుగాళ్లు తెరలేపినట్లు తెలిపారు. వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్‌కు APK ఫైల్స్ పంపిస్తున్నట్లు గుర్తించారు.

ఎట్టిపరిస్థితుల్లో అలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని అన్నదాతలకు పోలీసులు సూచిస్తున్నారు. ఈ లింక్ యాక్సెప్ట్ చేస్తే వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇలా చేస్తే మన కాంటాక్స్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్‌‍ పే, గూగుల్ పే వంటి యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు దోచేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన కొద్ది గంటలకే సైబర్‌ నేరగాళ్లు తమ ఖాతాలపై దాడులు చేయకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. SMS, ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే అనవసరంగా వచ్చే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ద్వారా లేదా cybercrime.gov.inలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఆర్థిక మోసాలకు సంబంధించిన విషయాలను వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..