Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

|

Mar 13, 2021 | 10:35 AM

Coronavirus Positive Cases Telangana: తెలంగాణ కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Corona Cases Telangana
Follow us on

Coronavirus Positive Cases Telangana: తెలంగాణ కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇందులో 1,918 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,97,363 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 168 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1652కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 34,482 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 91,49,467కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 52, జగిత్యాల 6, జనగాం 4, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల్ 1, కామారెడ్డి 5, కరీంనగర్ 11, ఖమ్మం 6, ఆసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 6, మహబూబాబాద్ 3, మంచిర్యాల 6, మెదక్ 1, మేడ్చల్ 18, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గొండ 4, నారాయణపేట 0, నిర్మల్ 3, నిజామాబాద్ 3, పెద్దపల్లి 4, రాజన్న సిరిసిల్ల 6, రంగారెడ్డి 19, సంగారెడ్డి 8, సిద్ధిపేట 7, సూర్యాపేట 0, వికారాబాద్ 2, వనపర్తి 2, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 11, యదాద్రి భోనగిరిలో 4 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!