Congress: కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఏర్పాటు.. షర్మిల చేరికపై కేసీ వేణుగోపాల్‌ కీలక వ్యాఖ్యలు

|

Sep 04, 2023 | 10:01 PM

త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ మరో కీలక కమిటీని ప్రకటించింది. ఇటీవల 84మందితో సీడబ్ల్యూసీని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం తాజాగా పార్టీ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం 16 మంది ఉండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి చోటు కల్పించారు. ఈ కీలక కమిటీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, అంబికా సోనీ తదితరులు ఉన్నారు.

Congress: కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఏర్పాటు.. షర్మిల చేరికపై కేసీ వేణుగోపాల్‌ కీలక వ్యాఖ్యలు
Sharmila And Kc Venu Gopal
Follow us on

త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ మరో కీలక కమిటీని ప్రకటించింది. ఇటీవల 84మందితో సీడబ్ల్యూసీని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం తాజాగా పార్టీ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం 16 మంది ఉండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి చోటు కల్పించారు. ఈ కీలక కమిటీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, అంబికా సోనీ, అధిర్‌ రంజన్‌ చౌధురి, సల్మాన్‌ ఖుర్షిద్‌, మధుసూదన్‌ మిస్త్రీ, ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టీఎస్‌ సింగ్‌ దేవ్‌, కేజే జార్జ్‌, ప్రీతమ్‌ సింగ్‌, మహమ్మద్‌ జావేద్‌, అమీ యజానిక్‌, పీఎల్‌ పునియా, ఓంకార్‌ మార్కమ్‌, కేసీ వేణుగోపాల్‌ ఉన్నారు. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్‌ వేదికగా జరగనుంది.

ఈ నెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 17న CWC విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. విస్తృతస్థాయి సమావేశంలో CWC సభ్యులతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. సెప్టెంబర్‌ 17న సాయంత్రం హైదరాబాద్‌ సమీపంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు వేణుగోపాల్‌ తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించే నాయకుల వాహన శ్రేణికి ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పచ్చజెండా ఊపుతారని వెల్లడించారు. సెప్టెంబర్‌ 18న 119 నియోజకవర్గాల్లో పర్యటించే నాయకులు కార్యకర్తలతో సమావేశాలు, తెలంగాణ ఎన్నికలకు 5 హామీలు అందించడంతో పాటు BRS ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తారని వేణుగోపాల్‌ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో భారత్‌ జోడో యాత్ర ప్రారభించి ఏడాది పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17న 722 భారత్‌ జోడో యాత్రలు చేపట్టనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై కూడా కేసీ వేణుగోపాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా,రాహుల్‌తో షర్మిల ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ చర్చలు మంచి వాతావరణంలో జరిగినట్లు చెప్పారు. అయితే ఆ చర్చల వివరాలను కూడా వైఎస్ షర్మిల కూడా వివరించినట్లు తెలిపారు. అయితే తర్వతా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.